Pithapuram Janasena Campaign : సినీ ప్రముఖులతో కళకళాడుతున్న పిఠాపురం

సినీ స్టార్స్ మాత్రమే కాదు బుల్లితెర స్టార్లు సైతం పవన్ కళ్యాణ్ కోసం గత నాల్గు రోజులుగా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతున్నారు

Published By: HashtagU Telugu Desk
Pitapuram Cine

Pitapuram Cine

పిఠాపురం (Pithapuram )..ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. మొన్నటి వరకు ఈ పేరు అంటే తెలియని వారు సైతం ఇప్పుడు పిఠాపురం గురించి తెలుసుకునే పనిలో పడ్డారు. దానికి కారణం జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయడమే. మాములుగా ఓ సాధారణ సినిమా వ్యక్తి ఓ గ్రామానికి వస్తేనే సందడి సందడిగా ఉంటుంది. అలాంటిది టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు…ఎంతో పేరు , గుర్తింపు ఉన్న స్టార్ ఎమ్మెల్యే గా నిల్చోవడంతో అంత పిఠాపురం గురించి మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారన్న దగ్గరి నుండి గూగుల్ లో పిఠాపురం పేరు మారుమోగడం మొదలైంది. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న దగ్గరి నుండి ప్రతి ఒక్కరూ పిఠాపురం గురించి అడగడం..పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్ల తో గెలుస్తారు..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం పిఠాపురం అంత సినీ స్టార్ల తో కళకలాడుతుంది. సినీ స్టార్స్ (Cine Stars) మాత్రమే కాదు బుల్లితెర స్టార్లు సైతం పవన్ కళ్యాణ్ కోసం గత నాల్గు రోజులుగా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది , పృద్వి , గెటప్ శ్రీను , రైజింగ్ రాజు , దొరబాబు తదితరాలు ప్రచారం ముమ్మరంగా చేస్తుండగా..ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej కూడా బాబాయ్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ఉదయమే రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన వరుణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం పిఠాపురంలో రోడ్డు షోస్, ర్యాలీలు చేస్తూ వరుణ్ బిజీ బిజీ గా గడుపుతున్నారు. సినీ తరాల ప్రచారం తాలూకా వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Read Also : AP Elections : టీడీపీ ప్రచార వాహనాన్ని తగలబెట్టిన దుండగులు

  Last Updated: 27 Apr 2024, 04:06 PM IST