Site icon HashtagU Telugu

Pinnelli: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy)కి భారీ ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ (Bail) ను హైకోర్టు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటె పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షాక్ ఇచ్చేందుకు పోలీసులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయనపై పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పిన్నెల్లి బెయిల్ పై బయటకు వస్తారనే ప్రచారం నిన్నటి నుండి స్థానికంగా జోరుగా సాగింది. దీంతో జైలు వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు చేరుకున్నారు. రామకృష్ణారెడ్డి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జైలు పరిసరాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

Read Also : Pawan – Chandrababu : బాబు వద్ద నేర్చుకుంటా – పవన్ కళ్యాణ్