Pinnelli Ramakrishna Reddy : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..?

పిన్నెల్లి పిటిషన్లుపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరింది.

Published By: HashtagU Telugu Desk
Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా..? అంటే అవుననే చెప్పొచ్చు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తనపై నమోదైన పలు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసుల తీవ్రత దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కేవలం ఈవీఎం ను ధ్వసం చేసిన కేసు మాత్రమే కాదు ఈయన ఫై మరో మూడు కేసులు ఉన్నాయి. టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదయింది. కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదయింది. ఇలా మొత్తం నాలుగు కేసులు ఆయనపై ఉన్నాయి. ఈ నాలుగు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేశారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్‌పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర బెయి‌ల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లుపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరింది. కాగా మధ్యంతర బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈరోజు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Read Also : Leader of the Opposition : ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. ఏయే పవర్స్ ఉంటాయో తెలుసా ?

  Last Updated: 26 Jun 2024, 04:02 PM IST