Pinnelli : ‘పిన్నెల్లి పైశాచికం’ పుస్తకం విడుదల చేసిన టీడీపీ

టీడీపీ రిలీజ్ చేసిన ఈ పుసక్తంలో 23 పేజీలు ఉన్నాయి. ఒక్కో పేజీ ఒక్కో సంచలనమే. పిన్నెల్లి బ్రదర్స్ (Pinnelli Brothers) చేసిన.. చేస్తున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయి

  • Written By:
  • Publish Date - May 29, 2024 / 04:37 PM IST

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయ్యి ఉండి, పోలింగ్ జరుగుతున్న వేళ పోలింగ్ బూత్ కు వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేసి వార్తల్లో నిలిచాడు. అంతే కాదు పలు దాడులు కూడా చేయడం తో ఈయన ఫై పలు కేసులు నమోదు చేసారు.ప్రస్తుతం బెయిల్ ఫై బయట తిరుగుతున్నాడు. కాగా
‘పిన్నెల్లి పైశాచికం’ పేరిట టీడీపీ (TDP) ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, అశోక్‌బాబు తదితరులు ఈ పుస్తకాన్ని మీడియా ముందు విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాల్లేకుండా పోయిందని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలతో మాచర్ల ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చినందునే ఆయన పారిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నేతలు తెలిపారు.

ఇక టీడీపీ రిలీజ్ చేసిన ఈ పుసక్తంలో 23 పేజీలు ఉన్నాయి. ఒక్కో పేజీ ఒక్కో సంచలనమే. పిన్నెల్లి బ్రదర్స్ (Pinnelli Brothers) చేసిన.. చేస్తున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయి. పిన్నెల్లి నేర వారసత్వం మొదలుకుని.. హత్యాకాండ వరకూ అన్ని విషయాలూ పూసగుచ్చినట్లుగా టీడీపీ రాసుకొచ్చింది. దీంతోపాటు రూ. 2 లక్షల ఆదాయం నుంచి రూ. 2వేల కోట్లకుపైగా ఆస్తుల కూడబెట్టిన విధానం కూడా బుక్‌లో ఉంది. 2011-12లో పిన్నెల్లి ఆదాయం రూ. 1.95 లక్షలు.. నేడు అధికారికంగా రూ. 43 లక్షలు చూపిస్తున్నా అనధికారికంగా అది రూ. 200 కోట్లకు పైగానే ఉంది. అంతేకాదు.. అప్పులతో ఊరు వదిలి పారిపోయిన పరిస్థితి నుంచి అధికారం అడ్డుపెట్టుకుని వేలకోట్లకు పడగలెత్తారు. ఈ విషయాలన్నింటినీ పుస్తకంలో నిశితంగా వివరించింది టీడీపీ. 2019 నుంచి ఇప్పటి వరకూ టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు, దాష్టీకాలను వివరించింది. దీంతోపాటు.. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ చేయించిన దాడులు 79 కాగా.. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై 51 దాడులు పేర్లతో సహా ఉన్నాయి.

Read Also  : Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్‌కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్లు