Site icon HashtagU Telugu

AP : వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పంచిన చీరలను మోహన విసిరికొట్టిన మహిళలు

Ap Sarees

Ap Sarees

ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? సంక్షేమం కాదు రాష్ట్ర అభివృద్ధి కావాలని భావిస్తున్నారా..? బటన్ నొక్కి రూ.10 వేలు వేస్తున్న దాని గురించి కాదు..తమ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారా..? అంటే అవుననే చెప్పడానికి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఘటనే నిదర్శనం. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని..అధికార పార్టీ నేతలు ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు. మాములుగా పోలింగ్‌ ముందు రోజు రాత్రి చేపట్టే పంపకాలు వారం రోజుల ముందే మొదలు పెట్టారు. డబ్బులు , మద్యం , మహిళలకు చీరలు , గిఫ్ట్ లు ఇలా ఎవరికీ తగినట్లు వారు పంపకాలు మొదలుపెట్టారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అలాగే పంపకాలు చేసారు. కానీ మహిళలు మాత్రం వారు పంచిన చీరలను వారి మోహన విసిరికొట్టి జై జనసేన అని నినాదాలు చేసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధికి భారీ షాక్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దాదాపు 300 మంది మహిళలు తిరుగుబాటు కార్యక్రమంగా వైసీపీ నాయకులు పంచి పెట్టిన చీరలను చిరాకుతో విసిరికొట్టారు. చీరలను పంచిన వైసీపీ నాయకులు ఇళ్ల మీదకే ఆ చీరలను విసిరేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలోని మునుపెన్నడూ లేని విధంగా మహిళల తిరుగుబాటుతో పినపళ్ళ గ్రామం ఆదర్శగ్రామంగా నిలిచిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాక పినపళ్ళ గ్రామంలోనే కాక మిగతా గ్రామాలలో కూడా ఇదే మార్పు వచ్చి తిరుగుబాటు చేస్తే అవినీతి చేసే నాయకుడు ఒకడు కూడా వుండడని ఆ గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ తెలిపారు కొత్తపేట నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావుకే తమ ఓటు అని ప్రజలు తేల్చి చెపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ఘటన కు సంబంధించి వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

Read Also : Polling Staff : పోలింగ్ సిబ్బందికి గుడ్లు మాత్రమే.. చికెన్ నో..!