ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ వైస్సార్సీపీ (YSRCP) లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సొంత నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా..తాజాగా కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అంతర్గత విభేదాలు వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ (Venugopala Krishna) కు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandra Bose) కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఆదివారం రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అంతే కాదు అవసరమైతే వైస్సార్సీపీ నుండి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, క్యాడర్ దగ్గర చెల్లుబోయిన వేణు ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు. తమను వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. వైస్సార్సీపీ ఆవిర్భావం నుంచి తాము సీఎం జగన్‌తోనే ఉన్నామని గుర్తు చేశారు. ఇద్దర్నీ పిలిచి సమావేశపరుస్తానని సీఎం జగన్ చెప్పారని అన్నారు. అసలు క్యారెక్టర్ లేని వ్యక్తితో తాను కూర్చోనని చెప్పేశానని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ప్రస్తుతం చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు వైస్సార్సీపీ లో చర్చగా మారాయి.
Read Also : Tomatoes Hijacking: రైతును బెదిరించి టమాటా ట్రక్కును హైజాక్ చేసిన దంపతులు.. పోలీసులు అదుపులో నిందితులు..!