YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

ఏపీలో ఇప్ప‌డు ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో రాష్ట్రంలో

  • Written By:
  • Updated On - January 31, 2023 / 04:31 PM IST

ఏపీలో ఇప్ప‌డు ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో రాష్ట్రంలో ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి త‌న ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను అవ‌మానించిన చోట ఉండ‌లేం అంటూ అనుచ‌రుల ముందు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తన ద‌గ్గ‌ర మ‌రో 12 సిమ్ కార్డులు ఉన్నాయ‌ని తెలిపారు. ఇటు వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూడా ఇదే త‌ర‌హాలో ఆరోప‌ణ‌లు చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాదిన్నరగా తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి ఆరోపించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా వాట్సాప్ కాల్స్ చేయాల్సి వస్తోందని ఆయన వాపోయారు. తమ పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తుంటే తాను ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ అనిశ్చితి ఉందని… రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదని అన్నారు.

త‌న‌ను లేకుండా చేయాల‌నే కుట్ర జ‌రుగుతుంద‌ని ఆరోపించారు. తాను లేక‌పోతే త‌నలాంటి పదిమంది త‌యార‌వుతార‌ని అంద‌రిని లేకుండా చేస్తారా అంటూ ప్ర‌శ్నించారు. అధికారంలో ఉన్న త‌న‌కు ఇప్పటికే భద్రతను తగ్గించారని… పూర్తిగా భద్రతను తొలగించాలని కోరుతున్నానని ప్ర‌భుత్వానికి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని… ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని… ఈలోగా ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ను ట్యాప్ చేయించడం వంటి పోకడలు ఎన్నడూ లేవని… ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలపై తన రాజకీయ జీవితం ఆధారపడి లేదని అన్నారు. ఈ ఇద్ద‌రి నేత‌ల వ్యాఖ్య‌ల‌తో మిగిలిన ఎమ్మెల్యేలు అలెర్ట్ అయ్యారు. త‌మ ఫోన్లు కూడా అధిష్టానం ట్యాప్ చేస్తుంద‌నే అనుమానాల‌తో ఉన్నారు.