Site icon HashtagU Telugu

Perni Nani : జగన్ కోసం డ్రైవర్ గా మారిన మాజీ మంత్రి

Perni Nani Bus Driver

Perni Nani Bus Driver

ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..అందుకోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోపక్క ప్రచారం మొదలుపెట్టారు. సిద్ధం (Siddham ) పేరుతో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరికాసేపట్లో దెందులూరులో సభ జరగబోతుంది. ఈ సభకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. 110 ఎకరాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. అలాగే సభా ప్రాంగణంలో 12 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

దాదాపు 50 నియోజకవర్గాలకు చెందిన వైసీపీ క్యాడర్, నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ సభకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సిద్ధం సభకు తమ వంతుగా క్యాడర్ ను భారీ ఎత్తున తరలించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani Turns As Bus Driver For Siddham Meeting) ఏకంగా బస్సు డ్రైవర్ గా మారిపోయారు. తన నియోజకవర్గం మచిలీపట్నం నుంచి వైసీపీ సిద్ధం సభకు ఏలూరు వెళ్లేందుకు బయలుదేరిన కార్యకర్తల్ని ఎక్కించుకుని బస్సులో స్వయంగా బయలుదేరారు. బందరుకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు, నేతలు ఈ బస్సులో ఉన్నారు. ఈ బస్సును పేర్నినాని స్వయంగా నడపడం అందర్నీ ఆసక్తి పెంచింది.

We’re now on WhatsApp. Click to Join.

మధ్యాహ్నం 3.20 గంటలకు దెందులూరులోని హెలిప్యాడ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 4.45 గంటల వరకు ఆయన సభలో ప్రసంగించనున్నారు. భీమిలీ సభను మించి ఉండేలా ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో, అంటే మొత్తం 50 నియోజకవర్గాల ప్రజలతో భారీ సభకు రూపకల్పన చేశారు. ఈ సభకు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ప్రజలు రానున్న క్రమంలో విస్తృతంగా ఏర్పాట్లు చేసారు.

Read Also : TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన