ఏపీలో ఇప్పుడంతా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయం నడుస్తోంది. ఆయన మూడు పెళ్లిళ్ల మ్యాటర్ కాస్త తెరపైకి వచ్చింది. ఇదే విషయంపై మాజీ మంత్రి పేర్నీ నాని పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని నీతులు…సూక్తు చెబుతే ఎవరు వింటారంటూ సెటైర్లు వేసారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ తీరును ప్రశ్నించారు పేర్నీ నాని. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట మార్చడంలో పవన్ను మించిన వారేవ్వరూ లేరన్నారు. మాట మార్చేవారికి పవన్ ఐకాన్ గా నిలిచారని ఎద్దేవా చేశారు. 2014లో టీడీపీకి ఓటు వేయాలని చెప్పిన పవన్ …2019లో టీడీపీకి ఓటు వేయద్దంటూ చెప్పాని గుర్తు చేశారు. అదే 2014లో బీజేపీకి ఓటు వేయద్దని చెప్పి…2019లో బీజేపీ వేయమని చెప్పారన్నారు.
అమరాతవతిపైనా మాట మార్చడం కేవలం పవన్ కే చెల్లిందన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మహిళా మంత్రులపై దాడికి దిగిన తన పార్టీ కార్యకర్తలను మందలించాల్సిందిపోయి…వారిని వెనకేసుకురావడం ఏంటని ప్రశ్నించారు. పవన్ చెప్పే డైలాగులకు చిన్నపిల్లలు కూడా భయపడరని ఎద్దేవా చేశారు.