Site icon HashtagU Telugu

Tirumala Laddu : నీ ఆసుపత్రిలో చేసుకో భజన..:మాధవీలతపై పేర్ని నాని ఫైర్

Perninani Madavilatha

Perninani Madavilatha

AP: లడ్డూ వివాదం నేపథ్యంలో హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ తిరుమల వెళ్లిన బీజేపీ నేత మాధవీలతపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) దేశ వ్యాప్తంగా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శ్రీవారికి ఎంతో ఇష్టమైన లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయం బయటకు వచ్చిన దగ్గరి నుండి హిందువులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ..ఎంతో పాపం జరిగిందని వాపోతున్నారు. రాజకీయ పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కూడా ఈ ఘటన ఫై సీరియస్ అయ్యింది. ప్రభుత్వం సిట్ ను సైతం ఏర్పాటు చేసింది.

ఇక బిజెపి నేత మాధవీలత (MadhaviLatha ) తిరుమల లడ్డు వివాదంపై చిలుకూరు వెళ్లి అక్కడ పూజలు సైతం చేశారు. తిరుమల లడ్డును భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అలాంటి లడ్డుపై వివాదం తలెత్తడం ఆందోళన కల్గించే అంశమన్నారు. ఇది కోట్లాది హిందువుల మనోభావాలకు చెందిన అంశమన్నారు. హైదరాబాద్ నుండి వందేభారత్ ట్రైన్ లో తిరుమలకు తన అనుచరులు, కొంత మంది నేతలతో కలసి భజనలు చేసుకుంటూ , ఆ గోవిందుడి నామం జపిస్తూ.. వెంటేశ్వర స్వామివారి పాటలు పాడుతూ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు.

మాధవీలత ఇలా భజనలు చేసుకుంటూ రావడాన్ని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తప్పుబట్టారు. ‘ఆవిడెవరో భజన చేసుకుంటూ వచ్చేస్తోంది దిక్కుమాలినతనం. నీ ఆసుపత్రిలో చేసుకో భజన. ఎవరైనా హిందువుకు ఒక్క రూపాయి తగ్గించిందా ఆవిడ? హైదరాబాద్ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్న ఎంపీలు.. గతంలో అన్యమతస్థుడైన గవర్నర్ ను డిక్లరేషన్ ఇవ్వకుండా మోదీ దర్శనానికి తీసుకెళ్తే ఎందుకు అడగలేదు?’ అని ప్రశ్నించారు.

Read Also : Udhayanidhi Stalin : నేడు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణస్వీకారం..