Site icon HashtagU Telugu

Perni Nani : నారా లోకేశ్‌కు పేర్ని నాని కౌంటర్

Perni Nani Motha Mogiddam

Perni Nani Motha Mogiddam

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 16న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించడం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. అయితే.. ఈ క్రమంలో నారా లోకేశ్‌పై వైసీపీ నేతలు కౌంటర్లు పేలుస్తున్నారు.

కుర్చీ మడతపెట్టి సీఎం జగన్‌పై టీడీపీ (TDP) నేత నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని (Parni Nani) తన దైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘వాలంటీర్లు, వైసీపీ శ్రేణులు ఎక్కడ చొక్కా మడతపెడతారేమోనని లోకేశ్ కంగారుపడ్డారు. షామియానా షాపు నుంచి కుర్చీ తెప్పించి దాన్ని మడతపెట్టారు. టీడీపీ మీటింగ్‌ల కోసం జనం రాక ఖాళీగా ఉన్న కుర్చీలు మడతపెట్టుకోవడానికే మీకు సమయం సరిపోదు’ అని ఎద్దేవా చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆశించిన దాని కంటే ఎక్కువగా గ్రామ వాలంటీర్లు సేవలందిస్తున్నారని పేర్ని నాని అన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లు చొక్కా మడత పెట్టవలసిన సమయం ఆసన్నమైంది అన్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. దీంతో లోకేశ్ కంగారు పడిపోయి కుర్చీ తీసుకుని వచ్చి దాన్ని మడత పెడతానంటున్నారని చెప్పారన్నారు.

లోకేశ్ కుర్చీలు మడత పెట్టినా, బెంచీలు మడత పెట్టినా ఫలితం ఏమీ ఉండదని పేర్ని నాని సెటైర్లు వేశారు. లోకేశ్, చంద్రబాబు కలిసి వారి సమావేశాల్లో ఖాళీగా ఉన్న కుర్చీలు మడత పెట్టుకోవచ్చని విమర్శలు గుప్పించారు. వాలంటీర్లను చూసి వారు భయపడుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. మొన్నటిదాకా వాలంటీర్లు అమ్మాయిలను కిడ్నాప్ చేసి అమ్మేస్తున్నారని ఓ పవర్ స్టార్ పవర్ లెస్ స్టార్ చెప్పారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

Read Also : VIRAL: పోలీస్ జాబ్స్.. సన్నీలియోన్ పేరిట అడ్మిట్ కార్డు