చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) నేపథ్యంలో యావత్ తెలుగు ప్రజలు సంఘీభావం తెలుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఓ అక్రమ కేసులో బాబు ను అరెస్ట్ చేసిన పెద్ద ఎత్తున నిరసనలు , ఆందోళనలు , ధర్నాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా శనివారం..మోత మొగిద్దాం (Motha Mogiddam ) అనే వినూత్న కార్యక్రమం చేపట్టి బాబుకు మద్దతు తెలిపారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి ప్లేట్ మీద గరిటెతో, విజిల్ తో ఇలా ఎన్నో రకాలుగా మోత మోగించారు.
చిన్న పిల్లల దగ్గరి నుండి పండు ముసలి వారి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కు మద్దతు ప్రకటించారు. అలాగే మోత కు సంబదించిన వీడియోస్ కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమం సక్సెస్ కావడం తో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తం చేసారు. అక్టోబర్ 03 వరకు ఇలాగే రకరకాల వినూత్న కార్యక్రమాలను టీడీపీ ప్లాన్ చేసింది.
ఈ కార్యక్రమం ఫై అలాగే చంద్రబాబు అరెస్ట్ ఫై వైసీపీ నేత పేర్ని నాని స్పందించారు. చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు ఎవరూ బాధపడటం లేదు. నిరసన కార్యక్రమాలను కేవలం రాజకీయ కార్యక్రమాలుగా మాత్రమే చేశారు. లంచాలు తిని కంచాలు మోగిస్తారా అంటూ దుయ్యబడ్డారు. చంద్రబాబు జనం సొమ్ము తిన్నారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే నిరసన కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనడం లేదు. కోటి మంది కేడర్ ఉందని చెప్పుకునే టీడీపీకి మద్దతు ఎక్కడుంది. అక్రమ కేసులయితే చంద్రబాబుకు ఎందుకు కోర్టులో అనుకూల తీర్పులు రావడం లేదు. అమరావతి స్కాం, విన్నర్ రింగ్ రోడ్ స్కాంలో భారీగా వెనకేసుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ ఢిల్లీ వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టించుకోవాలని లోకేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబుపై కేసులో ఉంటే లోకేష్ ఎందుకు లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు అని పేర్ని నాని ప్రశ్నించారు.
లోకేష్ కు దమ్ముంటే చంద్రబాబు అక్రమాస్తుల మీద విచారణకు సిద్ధం అవ్వాలి. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి విచారణ చేద్దాం. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా..? చంద్రబాబుపై ఉన్న కేసులనింటిపైనా ఎందుకు స్టే తెచ్చుకున్నారు. బాబు ఇంతకాలం స్టేలు తెచ్చుకుని బతికాడు. యావజ్జీవ ఖైదు తప్పదనే స్టేలు తెచ్చుకున్నారు. కోర్టుల్లో చంద్రబాబు నిజాయితీ నిరూపించుకోవాలి అంటూ పేర్ని నాని హితవు పలికారు.
Read Also : Khammam Car Accident : ఖమ్మం-సూర్యాపేట రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..