Perni : కూటమి ప్రభుత్వంలో తల్లికి మాత్రమే వందనం..పిల్లలందరికి పంగనామాలు..!: పేర్ని నాని

కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప, ప్రజలు హ్యాపీగా లేరని వ్యాఖ్యానించారు.

Published By: HashtagU Telugu Desk
Perni Nani comments on Chandrababu Talliki Vandanam

Perni Nani comments on Chandrababu Talliki Vandanam

perni nani : వైసీసీ నేత పేర్ని నాని ఏపిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి(Jagan Mohan Reddy) పథకం అమ్మ ఒడిని కాపీ కొట్టి తల్లికి వందరం అని పేరు మార్చి తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప, ప్రజలు హ్యాపీగా లేరని వ్యాఖ్యానించారు. ఈ పుల్‌ హ్యాపీగా ఉన్ వాళ్లకు ఒకటి అడుగుతున్నా..జీవో ఎంఎస్.29 పేరుతో తల్లికి వందనం పథకం తీసుకువచ్చారు. వాస్తవంగా ఇది జగన్ మోహన్ రెడ్డి పథకం… అమ్మ ఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం అని పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే జగన్‌ ఇంట్లో ఒక్కరికే అమ్మ ఒడి పథకం ఇచ్చాడు.. మేం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తాం అని చెప్పారు. ఒకరైతే రూ.15 వేలు, ఇద్దరైతే రూ.30 వేలు, ముగ్గురైతే రూ.45 వేలు, నలుగురైతే రూ.60 వేలు ఇస్తాం అన్నారు. మరి నిజమే కాదా.. చంద్రబాబు నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వంలో తల్లికి మాత్రమే వందనమే… పిల్లలందరికీ పంగనామాలు. కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, జేపీ నడ్డా, పురందేశ్వరి… అందరూ కలిసి పిల్లలకు పంగనామాలు పెట్టారు.

జనాలను మోసం చేయడం తప్ప ఇది మరొకటి కాదు. ఓ సినిమాలో డైలాగు ఉంది. ఇది కూడా కూటమి డైలాగే..ఆరడుగుల బుల్లెట్‌ అంట..ఆరడుగుల అబద్ధం ఎవరయ్యా అంటే అది చంద్రబాబే. 2014 మేనిఫెస్టో చూసినా, 2024 మేనిఫెస్టో చూసినా అంతా మోసం, దగా!” అంటూ పేర్ని నాని కూటమి సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

Read Also: Weight Gain: బరువు పెరగాలనుకుంటున్నారా.. ఈ రోటి తినాల్సిందే?

 

 

 

 

 

 

 

  Last Updated: 12 Jul 2024, 04:37 PM IST