Perni Nani Political Retirement: పేర్ని నాని రాజకీయాలకు గుడ్ బై.. సీఎం జగన్ రియాక్షన్?

వైఎస్ జగన్ కేబినెట్లో కీలక మంత్రిగా పని చేసిన పేర్ని నాని ఈ రోజు సీఎం జగన్ ముందు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

Published By: HashtagU Telugu Desk
Perni Nani

New Web Story Copy 2023 05 22t133154.144

Perni Nani Political Retirement: వైఎస్ జగన్ కేబినెట్లో కీలక మంత్రిగా పని చేసిన పేర్ని నాని ఈ రోజు సీఎం జగన్ ముందు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ రోజు సీఎం జగన్ బందరు పోర్టులో పలు అభివృద్ధి కారక్రమాలు చేపట్టిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. పేర్ని నాని హాట్ కామెంట్స్ కి సభలో అందరు గొందరగోళానికి గురయ్యారు.

రూ.5,156 కోట్లతో బందరు పోర్టు పనులకు మే 22న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఇదే కార్యక్రమంలో పేర్ని నాని కూడా ప్రసంగించారు. పేర్ని నాని మాట్లాడుతూ… ఈ రోజు సీఎం జగన్ తో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందంటూనే.. సీఎం జగన్ తో వేదిక పంచుకోవడం ఇదే చివరి సారి కావొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తాను రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్తున్నట్టు ప్రకటించాడు. నాని ప్రకటనతో సభలో గందరగోళం నెలకొంది. కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆపమంటూ వాదించినప్పటికీ పేర్ని నాని తన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. ఈ సమయంలో సీఎం జగన్ చిరునవ్వుతో కనిపించడం కొసమెరుపు.

పేర్ని నాని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. తన కొడుకు కోసమే పేర్ని నాని రిటైర్మెంట్ ప్రకటించాడంటూ పోస్టులు పెడుతున్నారు. త్వరలోనే తన కొడుకును రాజకీయాల్లోకి దించేందుకు పేర్ని స్కెచ్ వేశాడని, దీంతో సీఎం జగన్ టికెట్ కన్ఫర్మ్ చేశాడని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా పేర్ని నాని ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.

Read More: Modi Award : ప్రధాని మోడీకి 2 దేశాల అత్యున్నత పురస్కారాలు

  Last Updated: 22 May 2023, 01:33 PM IST