Site icon HashtagU Telugu

Thota Chandrasekhar: కేసీఆర్ నాయకత్వం ఏపీ ప్రజలకు అవసరం!

Kcr Thota

Kcr Thota

వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనలో దౌర్జన్యాలు పెరిగి సామాన్యులు స్వేచ్చగా బ్రతకలేని దయనీయ పరిస్తితులు రాష్ట్రంలో నెలకొన్నాయని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ ద్వజమెత్తారు. బిఆర్ఎస్ నాయకులు ఆలమూరు రఫీ ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు జిల్లా బిజెపి మైనారిటీ మోర్చా జోనల్ ఇంచార్జీ నాగుల్ మీరా,షేక్ రబ్బాని సహా పలు జిల్లాలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించే బిజెపిని దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు ఈ క్రమంలో బిజెపిని ఎదుర్కొగల ఏకైక పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అన్నీ రంగాలు పూర్తిగా నిర్వీర్యమై అభివృద్ది కుంటుబడిందని ఆరోపించారు. టిడిపి ,వైసీపీ పార్టీల మోసపూరిత వాగ్ధానాలతో రాష్ట్ర ప్రజానీకం వంచనకు గురైందని దుయ్యబట్టారు. ఈ క్రమంలో భారాస ప్రత్యాన్మయ రాజకీయ శక్తిగా ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ది పధంలో నడిపిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన భారాస అధినేత కేసిఆర్ నాయకత్వాన్ని ఎపి ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

అనంతరం నాగుల్ మీరా మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి టిడిపి వైసీపీ పార్టీలు మద్దతు పలుకుతూ రాష్ట్ర ప్రయోజనాల్ని
తాకట్టు పెడుతూ పబ్బం గడుపుకొంటున్నాయని ఆరోపించారు. ముస్లిం మైనార్టీ వర్గాలపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నా వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముస్లిం మైనార్టీ వర్గ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు.

Also Read: Rajagopal Reddy: బండి సంజయ్‌ని చూసి ఏడ్చేశా, రాజగోపాల్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్