Nara Lokesh: జ‌నం మెచ్చేలా నా జ‌న్మ‌దినం జ‌రిపారు: నారాలోకేశ్

  • Written By:
  • Updated On - January 23, 2024 / 11:08 PM IST

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, కేక్ కటింగ్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాలోకేశ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పారు.

‘‘నా పుట్టిన రోజుని ఓ పండ‌గ‌లా జ‌రిపిన ప్ర‌తీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు. నా జ‌న్మ‌దినం జ‌నంకి ఉప‌యోగ‌ప‌డేలా వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం వ‌ల్ల నా జ‌న్మ సార్థ‌క‌మైంద‌ని ఆనందిస్తున్నాను. వివిధ మాధ్య‌మాల ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన అంద‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు. మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు నాకు కొండంత బ‌లం. నా జీవితం ప్ర‌జాసేవ‌కే అంకితం’’ నారా లోకేశ్ స్పందించారు.

నారా లోకేష్ 2009 లో పార్టీ ప్ర‌చార మేనేజ‌ర్‌గా ఆయ‌న రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు. అనంత‌రం రాజ‌కీయంగా ఎదిగి, శాస‌న‌మండ‌లికి ఎన్నికై, చంద్ర‌బాబు మంత్రివ‌ర్గంలో ఐటీ, పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి అయ్యారు. నారా లోకేష్ స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ ప‌ట్టాను మ‌రియు కార్నేగీ మెల‌న్ విశ్వ‌విద్యాల‌యం నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్ లో స్పెష‌లైజేష‌న్‌తో బ్యాచిల‌ర్ ఆఫ్ సైన్స్ ప‌ట్టాను పొందారు.

2009 పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గా పాల్గొంటూ, టీడీపీ రాజ‌కీయ కార్య‌కలాపాల‌ను నిర్వ‌హించ‌డం ప్రారంభించారు. చంద్ర‌బాబు నాయుడు, లోకేష్‌ను ఎమ్మెల్సీ గా ఎంపిక చేసి, అనంత‌రం త‌న మంత్రివ‌ర్గంలో ఐటీ, పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ది శాఖ‌ల మంత్రిగా నియ‌మించారు. 2014 నారా లోకేష్ టీడీపీ ప్రధాన కార్య‌ద‌ర్శి అయ్యారు. అనంత‌రం పార్టీలో అత్యున్న‌త నిర్ణ‌యాత్మ‌క విభాగ‌మైన పొలిట్‌బ్యూరోలో స‌భ్యుడిగా ఎదిగారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఏపీ రాజకీయాల్లో దూసుకుపోయారు. తాను పప్పు కాదు.. ఫైటర్ అని నిరూపించుకున్నాడు.