ఏపీలో ప్రస్తుతం జగన్ – షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తి గొడవలు (Jagan vs Sharmila Assets Fight) హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. షర్మిల చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. నాని కొన్ని ప్రశ్నలు సంధించారు. జగన్ ఆధ్వర్యంలోనే సాక్షి, భారతి సిమెంట్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటిలో షర్మిల లేదా ఆమె భర్త అనిల్ పేరు లేదని ఆయన పేర్కొన్నారు.
ఆస్తుల అంశంపై నాని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంతో పాటు, షర్మిలకు అప్పట్లో ఎందుకు అభ్యంతరం రాలేదో అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆస్తులు వేరే పథకాల్లో రాసిచ్చారని పేర్కొనడం, అలాగే పలు కీలకమైన వ్యంగ్య వ్యాఖ్యలతో తన మనోభావాలను తెలియజేశారు.
సండూర్ పవర్‌లో షర్మిలకు వాటా ఇచ్చిన విషయం, అలాగే జగన్ మీద పెట్టిన కేసులు, చంద్రబాబు, సోనియాతో కలిసి తిరిగే సమయంలో వైఎస్ ఆశయాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టారో అందరూ చూశారని, రాజశేఖర్ రెడ్డి అభిమానులు రాజకీయంగా చంద్రబాబును ఇప్పటికీ ద్వేషిస్తున్నారని పేర్ని నాని తెలిపారు.
Read Also : Diwali Special Naivedyam : దీపావళి రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఇవే..