Pemmasani Chandrashekar: పెమ్మసాని మామూలోడు కాదు… బ్యాగ్రౌండ్ ఇదే…!

పెమ్మసాని చంద్రశేఖర్....ఒక్కసారి ఎంపీగా గెలిస్తే..ఇంత ఫాలోయింగా? ఒక్కసారి ఎంపీగా గెలిస్తే.... ఏకంగా సెంట్రల్ కేబినెట్‌లో సీటా? అసలు పెమ్మసాని ఎవరు?

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 01:32 PM IST

Pemmasani: వాస్తవానికి అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే… పెమ్మసాని చంద్రశేఖర్‌ (Pemmasani CHandrashekar) 2014లోనే ఎంపీగా (Mp) పోటీ చేసేవారు. వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పోటీ చేయలేదు. అయితే ఇప్పుడు బరిలోకి దిగి 3 లక్షల 44 వేల 695 ఓట్ల మెజారిటీతో…. గుంటూరు ఎంపీగా (Guntur Mp) గెలుపొందారు. ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రి కూడా అయ్యారు.

చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు (Sambhashiva Rao) తెలుగుదేశం పార్టీ (TDP) ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట (NarsaraoPeta) ప్రాంత వాసులకు చిరపరిచితులు. చంద్రశేఖర్‌ ఎంసెట్‌లో (Eamcet Rank) 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో (Osmania University) ఎంబీబీఎస్‌ సీటు సాధించారు.

పీజీ చదివేందుకు అమెరికా (Ameriaca) వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్‌ స్టేట్స్‌ మెడికల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామ్‌ పూర్తి చేయడంలో వసతి, శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో (P.G) జనరల్‌ గైసింగర్‌ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం (Burripalem) నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతికాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

అమెరికాలో (US) లైసెన్సింగ్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థను స్థాపించారు. స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్దికాలంలోనే  వేల కోట్లకు ఎదిగింది. అమెరికాలోని డాలస్‌లో (Dallas) పెమ్మసాని ఫౌండేషన్‌ (Pemmasani Foundation) ద్వారా ఉచిత వైద్య సేవలు (Free Health Service) అందించారు.

2014లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు (Rayapati SambashivaRao) పోటీ చేశారు. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయన్ను…కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు (Chandrababu) ఎంపిక చేసారు.

జన్మభూమిపై మమకారంతో ప్రజలకు చేయాలనే లక్ష్యంతో రాష్ట్రానికి వచ్చారు. టీడీపీ తరఫున గుంటూరు లోక్‌సభకు మొదటిసారి పోటీచేసి గెలిచారు. లోక్‌సభలో అత్యంత సంపన్నుడైన ఎంపీ ఈయనే కావడం విశేషం. మోదీ క్యాబినెట్‌లో అనూహ్యంగా సహాయ మంత్రిగా చోటు సంపాదించారు. ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం పెమ్మసానికి 5705 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. లోక్‌సభ బరిలో నిలిచిన అభ్యర్థులందరిలో అత్యంత ధనికుడు కూడా ఆయనే.