Mayor Election : విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్‌గా కూటమి అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ఆయనకు ధ్రువపత్రం అందజేశారు.
Read Also: CM Chandrababu : అమరావతి రాష్ట్రానికి ఆత్మ వంటిది : సీఎం చంద్రబాబు
2021లో విశాఖ నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో తమ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. కానీ వైసీపీకి భారీ మెజార్టీ రావడంతో పీలా శ్రీనివాసరావుకు మేయర్ పదవి దక్కలేదు. గత నాలుగేళ్ల నుంచి విశాఖ నగరంలో టీడీపీ బలోపేతానికి ఆయన చేసిన కృషికి ఈరోజజు ఫలితం దక్కింది. వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆయన చేసిన పోరాటాన్ని గుర్తించిన టీడీపీ అధిష్టానం పీలా శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చింది. దీంతో నేడు ఆయన తొలిసారి జీవీఎంసీ మేయర్ అయ్యారు.
మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి బలపరిచిన రవీంద్రకు 34, వైసీపీకి మద్దతిచ్చిన వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్‌గా కూటమి అభ్యర్థి గెలిచినట్లు ప్రిసైడింగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు. ఇక, చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక చైర్మన్ ఎన్నిక సోమవారం జరిగింది. ఐదో వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్‌ను టీడీపీ అభ్యర్థిగా ప్రతిపాదించగా, 9వ వార్డు సభ్యుడు ఎస్ డీ హఫీజ్‌ను వైసీపీ మద్దతు తెలిపింది. ఈరోజు జరిగిన ఓటింగ్ లో కూటమి అభ్యర్థి సెల్వరాజ్‌కు 15 ఓట్లు రాగా, వైసీపీ ప్రతిపాదించిన అభ్యర్తి హఫీజ్‌కు 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ కౌన్సిలర్ సెల్వరాజ్ కుప్పం పురపాలిక చైర్మన్ అయ్యారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్రీనివాసరాజు సెల్వరాజ్ విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
Read Also: Gold ATM : గోల్డ్ ఏటీఎం వచ్చేసింది.. ఫీచర్లు ఇవీ