మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy ), చంద్రబాబు ప్రభుత్వం(CBN Govt)పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు “సూపర్ సిక్స్” (Super Six) అంటూ హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు మార్చుకుంటూ, ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారిపోతుందని బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు విమర్శలు చేశారని, కానీ వైసీపీ పాలనలో ఏపీని అభివృద్ధి బాటలో నడిపిన ఘనత జగన్‌ది అని పెద్దిరెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమ నిజస్వరూపం బయటపడిందని ఆరోపించారు.
Budget 6 Key Announcements : ఈసారి కేంద్ర బడ్జెట్‌లో 6 కీలక ప్రకటనలు.. ఇవే ?
జగన్ చెప్పిన మాట నిలబెట్టుకున్న నేత అని, ఆయన పాలనలో సంక్షేమ పథకాలు పూర్తిగా అమలయ్యాయని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటి ప్రభుత్వం అప్పులు చేస్తూనే సంక్షేమాన్ని కత్తిరిస్తోందని ఆరోపించారు. 7 నెలల్లోనే 1.19 లక్షల కోట్లు అప్పు తెచ్చారు కానీ, ఆ డబ్బుతో ప్రజలకు ఏం చేశారో చెప్పలేకపోతున్నారని విమర్శించారు. తమ హయాంలో ఆరోగ్యశ్రీ, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వలన ప్రజలకు మేలు జరిగిందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం అవి సరిగ్గా అమలు కాకుండా అడ్డంకులు పెడుతోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లిందని, కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఒనగూరేలా లేవని విమర్శించారు.
చివరగా అమరావతిలో రియల్ ఎస్టేట్ కోసం టీడీపీ ప్రభుత్వం కష్టపడుతోందని పెద్దిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలను ఆదుకోవడం విధ్వంసమా? రియల్ ఎస్టేట్ కోసం పరితపించడం నిజమా? అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రుసరుసలాడారు.