Site icon HashtagU Telugu

Diwali : పాకిస్థాన్లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్

Pawan Tollywood

Pawan Tollywood

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లలోని హిందువులకు ‘దీపావళి’ శుభాకాంక్షలు (Diwali WIshes) తెలిపారు. వారందరి భద్రతకు భారత్లోని హిందువులు ప్రార్థిస్తున్నారని తెలుపుతూ.. పాకిస్థాన్లో ఓ హిందూ బాలుడు పాట పాడిన వీడియోను షేర్ చేశారు.

జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభవాళి దీపావళి అని అభివర్ణించారు. దీపాల శోభతో దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అనాదిగా వస్తున్న ఈ దీపావళి పండుగ ప్రజలకు సకల శుభాలను కలుగజేయాలని కోరారు. దీపావళి అంటే దీపాల శోభతో పాటు బాణసంచా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని , జాగ్రత్తలు పాటిస్తే దీపావళి నిజంగా నయనానందకరంగా… మనస్సులో గుర్తుండి పోతుందన్నారు. కొద్దిగా అజాగ్రత్తతోనో ,… నిర్లక్ష్యంగానో టపాకాయలు పేలిస్తే అది కాళరాత్రిగా మారుతుందని హెచ్చరించారు.

ప్రతి సంవత్సరం దీపావళి పండుగ తర్వాత పలువురు బాణసంచా గాయాలతో ఆసుపత్రిపాలు కావడం మనం చూస్తూనే ఉంటామని, కాబట్టి పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనాదిగా జరుపుకుంటున్న ఈ దీపావళి అందరికీ శుభాలను కలిగించి… ఆనందం… ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు.

Read Also : Best Masks : కాలుష్యం నుండి రక్షణ కోసం ఏ మాస్కులు బెస్ట్‌..!