Pawan Kalyan : మేకలు అమ్మేసి పార్టీ కోసం ప్రచారం..అండగా ఉంటా..మాటిచ్చిన పవన్‌

Pawan Kalyan: జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ సారి పిఠాపురం(Pathapuram) నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తనపై అభిమానంతో మేకలు అమ్మేసి పార్టీ కోసం ప్రచారం చేస్తున్న వారి త్యాగం గురించి యూట్యూబ్‌ వీడియోల ద్వారా పవన్‌ కల్యాణ్‌ తెలుసుకున్నారు. దీంతో రెల్లి వర్గాల మహిళలను నేరుగా కలిసి ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. పిఠాపురంలోనే ఉంటా అభివద్థి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చిరు. అయితే రెల్లి వర్గాల మహిళలు […]

Published By: HashtagU Telugu Desk
Pawan who sold goats and campaigned for the party..will be there.

Pawan who sold goats and campaigned for the party..will be there.

Pawan Kalyan: జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ సారి పిఠాపురం(Pathapuram) నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తనపై అభిమానంతో మేకలు అమ్మేసి పార్టీ కోసం ప్రచారం చేస్తున్న వారి త్యాగం గురించి యూట్యూబ్‌ వీడియోల ద్వారా పవన్‌ కల్యాణ్‌ తెలుసుకున్నారు. దీంతో రెల్లి వర్గాల మహిళలను నేరుగా కలిసి ప్రజలకు అండగా ఉంటానని మాటిచ్చారు. పిఠాపురంలోనే ఉంటా అభివద్థి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చిరు. అయితే రెల్లి వర్గాల మహిళలు పవన్‌ కల్యాణ్‌ కలిసిన ఆనందంతో భావోద్వేగానికి లోనయ్యారు. వారిని పవన్‌ కల్యాణ్‌ హత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఫోన్‌లో వారి వీడియోలు చూశారు. పస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వీరి ప్రచారం కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో… సాయంత్రం 7 గంటలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించే బహిరంగసభల్లో వీరు పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇద్దరు నేతలు వేర్వేరు హెలికాప్టర్లలో తణుకు చేరుకుంటారు. అనంతరం పట్టణంలోని నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగసభలో పాల్గొంటారు. సభ అనంతరం ఇద్దరు నేతలు రోడ్డు మార్గంలో నిడదవోలు వెళ్తారు. అక్కడి సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. సభ పూర్తయిన తర్వాత నిడదవోలు తిరుమల సాయి కల్యాణ మంటపంలో… పవన్ కల్యాణ్ రాజమండ్రిలోని షెల్టాన్ హోటల్ లో బస చేస్తారు. రేపు ఉదయం నిడదవోలులో ఉభయగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

Read Also: One Voter : ఈ పోలింగ్ బూత్‌ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. హ్యాట్సాఫ్ ఈసీ

  Last Updated: 10 Apr 2024, 02:09 PM IST