Pawan Kalyan : కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగొడతామంటూ జగన్ ను హెచ్చరించిన పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని…కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామన్నారు. ఏపీలోఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మధ్య మాటలు పెరిగిపోతున్నాయి. సవాల్ కు ప్రతి సవాల్ , ఛాలెంజ్ కి ఎదురు ఛాలెంజ్ ఇలా మాట కు మాట చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ( […]

Published By: HashtagU Telugu Desk
Pawan Jagan

Pawan Jagan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ (Jagan) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రౌడీయిజం చేస్తామంటే కుదరదని…కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామన్నారు. ఏపీలోఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మధ్య మాటలు పెరిగిపోతున్నాయి. సవాల్ కు ప్రతి సవాల్ , ఛాలెంజ్ కి ఎదురు ఛాలెంజ్ ఇలా మాట కు మాట చెపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ ( MLA Arani Srinivas ) జనసేన పార్టీలోచేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులు కు జనసేన కండువా కప్పి పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. ఆరణి శ్రీనివాస్ నేతృత్వంలో జనసేనలోకి చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు చేరారు.

ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం ఐదుగురు రెడ్డి నేతల హస్తాల్లో ఇరుక్కుపోయిందని, వైసీపీ మళ్లీ గెలిస్తే రాయలసీమ గురించి మర్చిపోవచ్చన్నారు. ఎర్రచందనం దుంగలు కొట్టే వారిని ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నారని వారు గెలిస్తే ఏం చేస్తారన్నారు. అలాగే ఇది 2009 కాదని.. 2024 అని జగన్ గుర్తు పెట్టుకోవాలని.. రౌడీయిజం చేస్తామంటే కుదరదని…కాళ్లకు కాళ్లు.. కీళ్లకు కీళ్లు విరగ్గొడతామంటూ జగన్ ను హెచ్చరించారు.

ఇదే సందర్బంగా తనకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసి వైసీపీలోకి వెళ్లిన కాపు నేతలపై సెటైర్లు వేశారు. అలా చేయాలి.. ఇలా చేయాలని లేఖాలు రాసిన వాళ్లు.. సలహాలు ఇచ్చిన వాళ్లు వైసీపీలో చేరిపోయారన్నారు. తనకు సీట్లు ఇవ్వడం.. తీసుకోవడం తెలియదా అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ల కోసం మాట్లాడే వాళ్లు పద్దతిగా మాట్లాడాలని సూచించారు.

Read Also : TS Annual Budget : తెలంగాణ వార్షిక రుణం బడ్జెట్ అంచనాలను మించిపోయింది

  Last Updated: 07 Mar 2024, 05:18 PM IST