TDP : పవన్‌కు వర్మ తలనొప్పిని తప్పించిన చంద్రబాబు

ఏపీలో ఎన్నికలకు నగారా మోగింది. నిన్న భారత ఎన్నికల సంఘం (Election Comission in India) ఎలక్షన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీలో ప్రధాన పార్టీలు జోరుమీదున్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించేశాయి. కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల అభ్యర్థులను బదిలీ చేయడంతో ఆయా ప్రాంతాల్లోని సీనియర్‌ నాయకులు తిరుగుబాటు జెండాను ఎత్తుకుంటున్నారు. ఇదే సమయంలో అసంతృప్తి సెగలు […]

Published By: HashtagU Telugu Desk
Chandrababu (1)

Chandrababu (1)

ఏపీలో ఎన్నికలకు నగారా మోగింది. నిన్న భారత ఎన్నికల సంఘం (Election Comission in India) ఎలక్షన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీలో ప్రధాన పార్టీలు జోరుమీదున్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించేశాయి. కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల అభ్యర్థులను బదిలీ చేయడంతో ఆయా ప్రాంతాల్లోని సీనియర్‌ నాయకులు తిరుగుబాటు జెండాను ఎత్తుకుంటున్నారు. ఇదే సమయంలో అసంతృప్తి సెగలు రగులుతుండటంతో.. అధిష్టానం పెద్దలు ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈక్రమంలోనే.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు ఎమ్మెల్యే టికెట్‌ త్యాగం చేయాల్సిన ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మకు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఇస్తానని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

తొలుత పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని అనుకున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే పిఠాపురం కోసం పవన్ కోరడంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. పిఠాపురం టికెట్ పై ఎస్వీఎస్ఎన్ వర్మ (NVSN Varma) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. కానీ చివరికి ఆయన ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో ఆయన నిరాశను పూడ్చుకునేందుకు వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని బాబు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల తొలి జాబితాలో వర్మ పేరు పెడతానని హామీ ఇచ్చారు.

పిఠాపురం టీడీపీ క్యాడర్ అంతా జేఎస్పీ (Janasena) మద్దతుదారులతో కలిసి పనిచేసి పవన్ కళ్యాణ్ భారీ విజయానికి కృషి చేయాలని కోరారు. మీడియాతో వర్మ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుకు తాను ప్రియ శిష్యుడి లాంటివాడని అన్నారు. టీడీపీ క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తుందని, ఎన్నికల్లో ఆయనకు అఖండ మెజారిటీ ఇస్తామని హామీ ఇచ్చారు. వర్మ హామీతో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.
Read Also : Arvind Kejriwal: ఢిల్లీ సీఎంను వ‌ద‌ల‌ని ఈడీ.. మ‌రోసారి నోటీసులు

  Last Updated: 17 Mar 2024, 10:59 AM IST