Pawan varaahi : వారాహిపై `చెప్పు`ల చెల‌గాటం

ఏపీ రాజ‌కీయం ప‌వ‌న్ వారాహి (Pawan varaahi ) యాత్ర‌తో వేడెక్కింది. ఒక చెప్పు చూపిస్తే, రెండు చెప్పులు చూపిస్తామంటూ వైసీపీ రంగంలోకి దిగింది.

  • Written By:
  • Updated On - June 15, 2023 / 01:43 PM IST

ఏపీ రాజ‌కీయం ప‌వ‌న్ వారాహి (Pawan varaahi ) యాత్ర‌తో వేడెక్కింది. ఒక చెప్పు చూపిస్తే, రెండు చెప్పులు చూపిస్తామంటూ వైసీపీ రంగంలోకి దిగింది. ఆ పార్టీలోని కాపు నాయ‌కులు పేర్ని నాని, మంత్రి అంబ‌టి రాంబాబు మీడియా ముందుకొచ్చారు. క‌త్తిపూడి కేంద్రంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ చేసిన ప్ర‌సంగంపై వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. కేవ‌లం అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు మాత్ర‌మే పార్టీ పెట్టావా? అంటూ నిల‌దీశారు. ఎమ్మెల్యే కావ‌డానికి పార్టీ పెట్టాల్సిన అవ‌స‌రం ఏముందని నిల‌దీయ‌డం మొద‌లు పెట్టారు.

ఏపీ రాజ‌కీయం ప‌త‌నానికి ప‌రాకాష్ట అన్న‌ట్టుగా(Pawan varaahi)

వైసీపీ నేత‌ల్ని చెప్పు చూపుతూ చెప్పుతో కొడ‌తా అంటూ గ‌తంలో ప‌వ‌న్ (Pawan varaahi) మీడియాముఖంగా హెచ్చ‌రించారు. అందుకే, ఇప్పుడు ప్ర‌తిగా వైసీపీ నేత‌ల గురించి మాట్లాడితే రెండు చెప్పుల‌తో కొడ‌తామంటూ రెండు చెప్పుల‌ను మీడియా ముందు మాజీ మంత్రి పేర్ని నాని ప్ర‌ద‌ర్శించారు. దీంతో ఏపీ రాజ‌కీయం ప‌త‌నానికి ప‌రాకాష్ట అన్న‌ట్టుగా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. అటు జ‌న‌సేన ఇటు వైసీపీ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతోన్న రాజ‌కీయ దాడి హ‌ద్దుల్ని దాటి వెళ్లిపోతోంది. రాజ్యాంగంలోని ప్రాథ‌మిక సూత్రాల‌ను కూడా తుంగ‌లోతొక్కేసి మాట్లాడుకుంటున్నారు. తొలి రోజు ప‌వ‌న్ ప్ర‌సంగానికే రాష్ట్ర రాజ‌కీయం ఉడికిపోతోంది. ఇక ప‌ది రోజుల యాత్ర ముగిసే స‌మ‌యానికి స‌ల‌స‌ల కాగిపోయేలా ఉంది.

ప్రాధేయ‌ప‌డ‌డం ప‌వ‌న్ తొలి రోజు ప‌ర్య‌ట‌న‌లోని హైలెట్

ప‌ది రోజుల పాటు తొలి విడ‌త వారాహి యాత్రకు(Pawan varaahi) క‌త్తిపూడి వ‌ద్ద ప‌వ‌న్ శ్రీకారం చుట్టారు. ఆయ‌న స్పీచ్ కోసం అంద‌రూ ఆస‌క్తిగా చూశారు. కానీ, ఆయ‌న చేసిన ప్ర‌సంగం ఎక్క‌డా స్ప‌ష్టత‌ను ఇవ్వ‌లేదు. దండం పెడుతూ ఒక్క‌సారి ఓటు వేయండి ప్లీజ్ అంటూ ప్రాధేయ‌ప‌డ‌డం ప‌వ‌న్ తొలి రోజు ప‌ర్య‌ట‌న‌లోని హైలెట్. గ‌తంలో ఎప్పుడూ ఆ విధంగా ఆయ‌న ప‌ర్య‌ట‌న లేదు. ప‌దేళ్ల క్రితం పార్టీని పెట్టాను. మ‌రో 25 ఏళ్ల పాటు న‌డుపుతాను. న‌మ్మండి ప్లీజ్, ఒక్కసారి ఓటేసి అసెంబ్లీకి పంపండ‌ని వేడుకోవ‌డం గ‌మనార్హం.

తిక‌మ‌క‌పెడుతూ ప‌వ‌న్ ఇచ్చిన స్పీచ్ (Pawan varaahi)

కులాల‌ను దాటి రాజ‌కీయాలు ఉండాల‌ని డైలాగు కొట్టారు. వెంట‌నే కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏమి చెబుతార‌ని? ప్ర‌శ్నించారు. దీంతో స‌భికులు గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. ఇక పొత్తు గురించి అస్ప‌ష్టంగా మాట్లాడారు. `ఒంటిరిగా వెళ్లాల్సి వ‌స్తే వెళ‌దామంటారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా చేస్తానంటారు. బీజేపీతో పొత్తు ఉందంటారు. ఢిల్లీ నేత‌ల‌కు భ‌య‌ప‌డ‌నంటారు. వాళ్లంటే గౌర‌వ‌మ‌ని చెబుతూ వీడ‌లేన‌ని సంకేతాలు ఇస్తారు.` ఇలా ప‌లు ర‌కాలుగా తిక‌మ‌క‌పెడుతూ ప‌వ‌న్ ఇచ్చిన స్పీచ్ జ‌న‌సేన్యాన్ని గంద‌ర‌గోళంలోకి (Pawan varaahi) నెట్టేసింది.

Also Read : Pawan Kalyan: పవన్ కు పాదాభివందనం, నిర్మాతపై నెటిజన్స్ ఫైర్!

వైసీపీ ఎమ్మెల్మే అవినీతి ఫైల్స్ గ‌ది నిండా ఉన్నాయ‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. వాటిని ప్ర‌తిరోజూ చ‌దువుకుంటున్నాన‌ని చెప్పారు. వాటితో ఏమి చేస్తారు? అనేది మాత్రం ఆయ‌న చెప్ప‌లేదు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చూస్తానంటారు. ఇప్పుడు ఎన్నిక‌ల యాత్ర‌కు దిగిన ఆయ‌న‌కు ఇంత కంటే స‌మ‌యం ఏమిటో (Pawan varaahi)అర్థం కావడంలేదు. సంక్షేమ ప‌థ‌కాలు కావాలంటారు. అప్పులు మాత్రం ఉండ‌కూదంటారు. ఆయ‌న చెప్పే డైలాగులు సినిమాల్లో ర‌క్తిక‌డ‌తాయిగానీ వాస్త‌వ రూపంలోకి రావ‌డం అసాధ్యం.

ఒక్క‌సారి అసెంబ్లీ లోప‌ల‌కు పంపండి

సుప‌రిపాల‌న ఇచ్చే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప‌వ‌న్ (Pawan varaahi) ప్ర‌క‌టించారు. ఎలా అనేది మాత్రం గోప్యంగా ఉంచారు. అవినీతి ర‌హిత పాల‌న ఇస్తామ‌ని వెల్ల‌డించారు. సీఎం ప‌ద‌వి పోటీలో లేన‌ని ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌క‌టించారు. ఒక్క‌సారి అసెంబ్లీ మెట్లు తొక్కాల‌ని మాత్రం ఉంద‌ని అన్నారు. ఒక్క‌సారి అసెంబ్లీ లోప‌ల‌కు పంపండి అంటూ ప్రాధేయ‌ప‌డ‌డం స‌భికుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు వెల్ల‌డించ‌కుండా ప్లీజ్..ప్లీజ్ అంటూ ఓటర్ల‌కు దండం పెడుతూ అడుక్కోవ‌డం ప‌వ‌న్ తొలి రోజు వారాహి యాత్ర‌లోని ప్ర‌త్యేక ఘ‌ట్టం. ఆయ‌న స్పీచ్ లోని ఆంత‌ర్యాల‌ను గ‌మ‌నించిన వైసీపీ నేత‌లు రెండు చెప్పుల‌తో మీడియా ముందుకు వ‌చ్చి ప‌వ‌న్ కు వార్నింగ్ ఇవ్వ‌డం కొస‌మెరుపు.

Also Read : Janasena varaahi : ప‌వ‌న్ `ముంద‌స్తు` మాట! ఏపీ, తెలంగాణ ఎన్నిక‌లు ఒకేసారి..?