Site icon HashtagU Telugu

Amaravati Relaunch : మోదీ అమృత హస్తాలతో అమరావతి ప్రారంభం – పవన్

Amaravahirestart

Amaravahirestart

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి (Amaravati Relaunch) నూతన శకం ప్రారంభమైంది. ఈ పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధానికి హృదయపూర్వక స్వాగతం తెలిపారు. ‘‘అమరావతి ప్రజా రాజధానిని మీ అమృత హస్తాలతో పునఃప్రారంభిస్తున్నందుకు ఆంధ్ర ప్రజల తరఫున ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు. అమరావతి ప్రజల ఆకాంక్షలకు నిధానం అయిన నగరంగా మళ్లీ నిర్మితమవుతోందని పేర్కొన్నారు.

అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ‘‘నేడు రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమైన రోజు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణ పునఃప్రారంభం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దారులు చూపుతుందని స్పష్టంగా చెప్పారు. ‘‘అమరావతి మన ఆశలూ, కలలూ గల రాజధాని. దీని పునఃప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది’’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

1000 Madrassas: పాక్‌లో మొద‌లైన భ‌యం.. 1000 మదరసాలు మూసివేత‌!

అమరావతిని అభివృద్ధి చేసే దిశగా కేంద్రం ప్రాధాన్యతనిస్తూ మోదీ తీసుకునే ఈ అడుగు రాష్ట్ర ప్రజల్లో ఆశావహతను పెంచింది. గతంలో నిలిచిపోయిన నిర్మాణ పనులకు మరలా జీవం పోసే ఈ యత్నం, శాశ్వత రాజధాని నిర్మాణంపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమరావతి అభివృద్ధి వేగంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశగా మరింత దృఢంగా పయనించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.