Pawan Tour : గోదావ‌రికి `వారాహి` స‌ర్వీస్, BJP పొలిటిక‌ల్ ఆయిల్ !

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన యాక్టివ్ (Pawan Tour)అవుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 8వ తేదీ విశాఖ రానున్నారు.

  • Written By:
  • Updated On - June 2, 2023 / 05:14 PM IST

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన యాక్టివ్ (Pawan Tour)అవుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 8వ తేదీ విశాఖ రానున్నారు. అలాగే, 10వ తేదీన బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డా తిరుప‌తికి రావ‌డానికి షెడ్యూల్ చేసుకున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా మూల‌న‌ప‌డ్డ `వారాహి`(Vaarahi) గోదావ‌రి జిల్లా వైపు మ‌ళ్లుతోంది. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్ర‌క‌టించడానికి పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ బ్లూ ప్రింట్ త‌యారు చేశారు. తెలంగాణతో పాటు ఏపీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని చ‌ర్చ జ‌రుగుతోన్న వేళ బీజేపీ, జ‌న‌సేన యాక్టివ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన యాక్టివ్ (Pawan Tour)

గోదావ‌రి జిల్లాల మీద మాత్ర‌మే ఎక్కువ‌గా జ‌న‌సేన(Pawan Tour) దృష్టి పెట్టింది. గ‌తంలోనూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్కువ‌గా ఆ రెండు జిల్లాల‌ను న‌మ్ముకున్నారు. ఏపీ వ్యాప్తంగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుంటే సీఎం కావ‌చ్చ‌ని ప‌వ‌న్ కు ఆశ క‌ల్పిస్తున్నారు. కానీ, ప‌వ‌న్ మాత్రం సీఎం రేస్ లో ఉండ‌న‌ని చెబుతున్నారు. ఆయ‌న ఆప్ష‌న్ల‌ను మార్చుకుని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం ప‌ద‌వి నుంచి దింప‌డ‌మే మొద‌టి ఆప్ష‌న్ కింద పెట్టుకున్నారు. రెండో ఆప్ష‌న్ కింద టీడీపీతో పొత్తు, మూడో ఆప్ష‌న్ కింద బీజేపీతో క‌లిసి ఉండ‌డంకాగా నాలుగో ఆప్ష‌న్ కింద ఒంట‌రి పోరాటం చేయడ‌మ‌నేలా ప‌వ‌న్ వాల‌కం ఉంది.

ప్ర‌భుత్వ వ్యతిరేక ఓటు చీల‌కుండా చూస్తాన‌ని  

ప్ర‌భుత్వ వ్యతిరేక ఓటు చీల‌కుండా చూస్తాన‌ని చెప్పిన ఆయ‌న ఇప్పుడు పంథా మార్చుకున్నారు. ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు చెప్పిన విధంగా న‌డుచుకోవాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చారు. వాళ్ల డైరెక్ష‌న్ మేర‌కు `వారాహి` రోడ్ల మీద‌కు (Pawan Tour)రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న ప‌ర్య‌టిస్తారా? గోదావ‌రి జిల్లాల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితమా? అనేది ఇంకా సందేహంగా ఉంది. ప్ర‌త్యేకించి కాపు సామాజిక‌వ‌ర్గం ఆయ‌న వెంట ఉంది. బ‌లంగా ఆ సామాజిక‌వ‌ర్గం గోదావ‌రి జిల్లాల్లో ఉంది. వాళ్లంద‌రూ ఓటేస్తే గెలుస్తామ‌న్న ధీమాతో ప‌వ‌న్ ఉన్నారు. క్షేత్ర స్థాయి ప‌రిస్థితులు మారాయ‌న్న విష‌యాన్ని ఆయ‌న గ‌మ‌నించ‌లేక‌పోతున్నారు.

రిజ‌ర్వేష‌న్లో వాటాను కాపులు ఇప్పుడు కోరుకుంటున్నారు.

ఒకప్పుడు కాపు, బ‌లిజ‌, ఒంట‌రి అంటూ స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా(Vangaveeti Ranga) వినిపించారు. అప్ప‌ట్లోనూ ఆ స్లోగ‌న్ క్లిక్ కాలేదు. కాపులు, బ‌లిజ‌లు ఒక‌టి కాద‌నే భావం బ‌లంగా ఉంది. పైగా బ‌లిజ‌ల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ ఉంది. ఆ రిజ‌ర్వేష‌న్లో వాటాను కాపులు ఇప్పుడు కోరుకుంటున్నారు. అందుకు ప‌వ‌న్ మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు. ఇక ఒంట‌రి అనే ప‌దానికి అర్థం కూడా స్పష్టంగా లేదు. కాపు, బ‌లిజ‌, ఒంట‌రి కులాల ఈక్వేష‌న్ ఇప్పుడు ప‌నిచేయ‌దు. ఎందుకంటే, సుమారు 56 కులాల‌ను గుర్తించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాటికి కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వ స‌హాయాన్ని అందిస్తున్నారు. ఉప కులాల మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని బాగా ఎలివేట్ చేయ‌గ‌లిగారు. కాపు, బ‌లిజ‌, శెట్టి బ‌లిజ మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని బాగా చూపించారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. బీసీలుగా ఉన్న బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ ప్రాధాన్యం ఇస్తోంది.

వారాహి గోదావ‌రి జిల్లాల వ‌ర‌కు ప‌రిమితం(Pawan Tour)

ప్ర‌స్తుతం కుల స‌మీక‌ర‌ణాల్లో కాపులు మాత్ర‌మే ఓటేస్తే చాల‌నే రీతిలో ప‌వ‌న్ స్పీచ్ ప‌రోక్షంగా ఎలివేట్ అవుతోంది. అందుకోసం ఆయ‌న గోదావ‌రి జిల్లాల‌కు వారాహిని (Pawan Tour)మ‌ళ్లించార‌ని కూడా టాక్ బ‌య‌లు దేరింది. ఆయ‌న నిర్విరామంగా జ‌నం మ‌ధ్య ఉండ‌లేర‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు విమ‌ర్శిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా విశాఖ వ‌ర‌కు వెళ్లి ఆయ‌న రిసార్ట్స్ లో విశ్రాంతి తీసుకున్నారు. అక్క‌డ నుంచి ప్ర‌చారానికి కూడా రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాంటి అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని వారాహి గోదావ‌రి జిల్లాల వ‌ర‌కు ప‌రిమితం అవుతుంద‌ని భావిస్తున్నారు. కానీ, బీజేపీ పెద్ద‌లు ఇచ్చే డైరెక్ష‌న్ ప్ర‌కారం న‌డుచుకోలేక‌పోతే అస‌లుకే మోసం వ‌స్తుంద‌న్న ఆందోళ‌న కూడా జ‌న‌సైనికుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

Also Read : Janasena : ఉస్తాద్ పై బీజేపీ `లీనం`

మొత్తం మీద వార‌హి రోడ్డు (Pawan Tour)ఎక్కుతోన్న క్ర‌మంలో పొత్తుల అంశం మ‌రోసారి తెర‌మీద‌కు రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు పొత్తులు అంటూ రాజ‌కీయాన్ని ర‌క్తిక‌ట్టించారు ప‌వ‌న్. ఆయ‌న ప్ర‌జ‌ల్లో క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ రెండు నెల‌ల‌కు ఒకసారి పొత్తు అంటూ ప్ర‌చారం చేసుకుంటూ బ‌ల‌ప‌డ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ మాదిరిగా పొత్తుల‌తో బ‌ల‌ప‌డాల‌ని ప‌వ‌న్ లాజిక్. కానీ, ఏపీ ప‌రిస్థితులు వేర‌న్న విష‌యాన్ని ఆయ‌న మ‌ర‌చిపోతున్నారు. బీజేపీని వీడ‌లేని, టీడీపీతో క‌లివ‌లేని ప‌రిస్థితుల్లో జ‌న‌సేనాని `వారాహి` ఎటు మ‌ళ్లుతుందో చూద్దాం.

Also Read : Pawan Phobia: జగన్ కు పవన్ ఫోబియా! నిజాంపట్నం సభలో అరగంట పైగా జనసేనాని గురించే స్పీచ్