Pawan Kalyan : తిరుపతి బరిలో జనసేన అధినేత ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది. మరో వారం లో ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) వెలువడనుంది. నోటిఫికేషన్ వస్తే ప్రతి ఒక్క అభ్యర్థి తమ ప్రచారంలో బిజీ కావాల్సిందే. ఇప్పటీకే వైసీపీ అధినేత జగన్ (CM Jaga) సిద్ధం (Siddham)అంటూ వరుస సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉండగా..చంద్రబాబు సైతం రా కదలిరా అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం […]

Published By: HashtagU Telugu Desk
Pawan Speech 2

Pawan Speech 2

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది రోజు రోజుకు ఆసక్తి రేపుతోంది. మరో వారం లో ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) వెలువడనుంది. నోటిఫికేషన్ వస్తే ప్రతి ఒక్క అభ్యర్థి తమ ప్రచారంలో బిజీ కావాల్సిందే. ఇప్పటీకే వైసీపీ అధినేత జగన్ (CM Jaga) సిద్ధం (Siddham)అంటూ వరుస సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉండగా..చంద్రబాబు సైతం రా కదలిరా అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం ప్రచారం కాదు కదా..ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారనేది కూడా ఇక ఫిక్స్ కాలేదు.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల్లో భీమవరం , గాజువాక స్థానాల నుండి పవన్ పోటీ చేయగా..రెండు చోట్ల ఓటమి చెందారు. అందుకే ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తూ తనకు ఎక్కువ అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. గాజువాక , భీమవరం, పిఠాపురంఇలా పలు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి పోటీ చేస్తారని మొన్నటి వరకు వార్తలు వినిపించిన..ప్రస్తుతం మాత్రం పవన్ తిరుపతి(Tirupathi) నుండి బరిలోకి దిగాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తిరుపతి నుంచి పోటీ చేసేందుకు ఉన్న అవకాశాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం మాజీ కీలక నేతలకు ఫోన్ కాల్స్, సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. పవన్ పోటీ చేయకపోతే, బరిలోకి దిగేందుకు ఆరణి శ్రీనివాసులు, కిరణ్, హరి ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు పవన్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన భీమవరం నుంచి మాజీ MLA రామాంజనేయులును జనసేన బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికి పవన్ త్వరగా తన స్థానాన్ని ప్రకటిస్తే ఆ తర్వాత అభిమానులు , పార్టీ శ్రేణులే ప్రచారాన్ని చూసుకుంటారని అంత అంటున్నారు. మరి ఎక్కడి నుండి ఫిక్స్ అవుతారో చూడాలి.

Read Also : AP Politics : టీడీపీ-జనసేనపై బ్లూమీడియా బురద జల్లే ప్రయత్నం..!

  Last Updated: 06 Mar 2024, 09:10 PM IST