Site icon HashtagU Telugu

Pawan Varahi Yatra: అనకాపల్లిలో ఈ రోజు పవన్ పర్యటన

Pawan Varahi Yatra

Pawan Varahi Yatra

Pawan Varahi Yatra: ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా పవన్ ప్రజలకు చేరువవుతున్నారు. అడుగడుగునా ఆయనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అందులో భాగంగా పవన్ ఈ రోజు అనకాపల్లిలో పర్యటించనున్నారు. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఆదివారం అనకాపల్లి జిల్లాలో పవన్ ప్రజలని కలుసుకుంటారు.

కళ్యాణ్ మరియు ఆయన బృందం హెలికాప్టర్ లో అనకాపల్లి డైట్ కళాశాల సమీపంలోని ప్రైవేట్ లేఅవుట్‌లోని హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల మార్కెట్, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధితో పాటు పలు కీలక కూడళ్ల మీదుగా వారాహి వాహనంలో రోడ్ షో నిర్వహిస్తారు. ఈ యాత్ర రింగ్ రోడ్డులోని నెహ్రూచౌక్ జంక్షన్ వద్ద ముగుస్తుంది.

We’re now on WhatsAppClick to Join

4 గంటలకు నెహ్రూచౌక్ కూడలి వద్ద తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. వారాహి విజయభేరి యాత్ర సోమవారం ఎలమంచిలికి చేరుకుంటుంది, అక్కడ పవన్ కళ్యాణ్ స్థానిక నేతలతో సమావేశం అవుతారు. కాగా మంగళవారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ పాల్గొంటారు.

Also Read: Kia EVs: త్వ‌ర‌లో కియా నుంచి రెండు ఈవీలు.. లాంచ్ ఎప్పుడంటే..?