Site icon HashtagU Telugu

Pawan Varahi : వారాహిని బయటకు తీస్తున్న పవన్..

Pawan To Begin Election Cam

Pawan To Begin Election Cam

మళ్లీ జనసేన అధినేత (Pawan Kalyan) వారాహి వాహనం (Varahi Vehicle:) ఎక్కబోతున్నారు. అప్పుడెప్పుడో వారాహి వాహనం ఎక్కి హడావిడి చేసిన పవన్ కల్యాణ్, ఆ తర్వాత దాన్ని షెడ్డుకి పంపించి, తాను పొత్తుల వేటలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం మరోసారి వారాహి ని బయటకు తీయబోతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం (Pithapuram) నుండి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ఈరోజు జనసేన ముఖ్య నేతలతో జరిగిన భేటీలో పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. పురూహూతిక దేవికి పూజలు నిర్వహించి పవన్ వారాహి వాహనం నుంచి ఈ ప్రచారం ప్రారంభించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూనే, మరోవైపు వారాహి వాహనంతో రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు పవన్. పవన్ ప్రచారం కోసం వారాహి వాహనాన్ని ఇప్పటికే రెడీ చేశారు ఆపార్టీ నేతలు. జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున వారాహి వాహనంపై ప్రచారం చేయబోతున్నారు. ముందుగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి 27న ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. మూడు రోజుల పిఠాపురం టూర్ లో పవన్ .. నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు, మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పవన్ పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలిచ్చారు. అలాగే జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో వారాహివాహనంతో పవన్ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయిని, ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో కచ్చితంగా విజయం మనదే అన్నారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని, ఈ విజయ నాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలన్నారు.

Read Also : KCR: కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో చీక‌టి రోజు: కేసీఆర్