ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) ఆరోగ్యం బాగానే ఉన్న విషయాన్ని తెలియజేస్తూ, ఆశీర్వాదాలు, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్(Singapore)లో జరిగిన అగ్ని ప్రమాదం(Fire Accident)లో మార్క్ శంకర్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రమాద తీవ్రత తెలుసుకున్న వెంటనే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ (Modi), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) సహా పలువురు ప్రముఖులు ఫోన్ చేసి కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు.
Manchu Family Issue: మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మంచు ఫ్యామిలీ.. పోలీసులు ఏం చేశారంటే..?
ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ ధైర్యం తెలిపిన వారందరికీ ప్రెస్ మీట్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసారు. పవన్ కుమారుడి ప్రమాదం తెలియగానే ప్రధాని మోదీ తక్షణమే స్పందించి సింగపూర్‌లోని హైకమిషనర్‌కు సహకారం అందించమని సూచించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఫోన్ చేశారని పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, పలు రాష్ట్రాల నేతలు, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు అనేకరూపాల్లో తమ మద్దతు తెలిపారని పవన్ కల్యాణ్ తెలిపారు.
మార్క్ శంకర్ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందన్న వార్తతో పవన్ కల్యాణ్ ఊరట వ్యక్తం చేశారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా, ప్రత్యక్షంగా ఆకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడి కోలుకోవడంలో అందరి ప్రేమ, ఆశీర్వాదాలే ప్రధాన కారణమని పేర్కొంటూ, ప్రజల మద్దతు తన కుటుంబానికి బలాన్ని ఇచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు.