Site icon HashtagU Telugu

Pawan Kalyan : సిద్ధం అంటున్న జగన్ కు అసలైన యుద్ధం ఇద్దాం – పవన్ కళ్యాణ్

Pawan Speech Tdg

Pawan Speech Tdg

సిద్ధం (Siddham)..సిద్ధం (Siddham) అంటున్న జగన్ (Jagan) కు అసలైన యుద్ధం ఇద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న జనసేన – టీడీపీ(Janasena-TDP) పార్టీల ఉమ్మడి కూటమి ఈరోజు..తాడేపల్లి గూడెం లో ‘జెండా’ సభతో తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సభకు రెండు పార్టీల నుండి లక్షల్లో కార్యకర్తలు , అభిమానులు హాజరై..గ్రాండ్ సక్సెస్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ సభలో పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. సిద్ధం అంటున్న జగన్ కు అసలైన యుద్ధం ఇద్దాం అంటూ తాడేపల్లి గూడెం వేదికగా పిలుపునిచ్చారు. ‘వచ్చే 45 రోజులు జాగ్రత్త. వైసీపీ గూండాయిజానికి టీడీపీ, జనసేన కార్యకర్తలు భయపడవద్దు. వైసీపీ క్రిమినల్స్, గూండాలకు హెచ్చరిక. మీరు మా సభలపై గానీ, నాయకులు, కార్యకర్తలపైన గానీ, సామాన్యులపైన గానీ దాడిచేస్తే, భయపెడితే, బెదిరిస్తే నేను మాట ఇస్తున్నా. మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం’ అని హెచ్చరించారు. ‘యువతరానికి ఏ సంపద విడిచిపెట్టారు? గాయాలు, వేదనలు తప్ప. ఈ ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగాలు, అంగన్వాడీ కార్యకర్తలను సీఎం జగన్ మోసం చేశారు. అందరినీ మోసం చేసిన జగన్ కు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని పవన్ పేర్కొన్నారు.

అంతకు ముందు బాలకృష్ణ మాట్లాడుతూ..అధికార పీఠంపై కూర్చొని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని బాలకృష్ణ మండిపడ్డారు. ‘బ్రిటిష్ పాలకుల్లా కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారు. రైతుల్ని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కోడిగుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతోంది. త్వరలో టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తుంది’ అని తాడేపల్లిగూడెం సభలో ధీమా వ్యక్తం చేశారు.

Read Also : AP : వైసీపీ గుండాలకు అసలు సినిమా చూపిస్తాం – చంద్రబాబు