Mysurivaripalle : పవన్ సర్ ..మీకు ఈ పవర్ సరిపోదు..హైపవర్ కావాల్సిందే

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోని మైసూరువారిపల్లిలో జరిగిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు

Published By: HashtagU Telugu Desk
Mysoorivaripalli Pawan Kaly

Mysoorivaripalli Pawan Kaly

నేటి నుండి ఏపీలో ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో (Grama Sabhalu) గ్రామా సభలు మొదలుకాబోతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మార్కు పరిపాలనతో దేశచరిత్రలో నిలిచిపోయేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. గ్రామాలకు ఆదాయం.. అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభల్లో చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు తీర్మానించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోని మైసూరువారిపల్లిలో జరిగిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాగా ఈ సభలో ఆసక్తికర ఘటన జరిగింది. ప్రజలతో ముఖాముఖి నిర్వహించగా ఓ వ్యక్తి పవన్ సీఎం కావాలంటూ అభిప్రాయపడ్డారు. ‘డిప్యూటీ సీఎం గారు. ఈ పవర్ చాలదు. హైపవర్ కావాలి. అంటే 2029లో మీరు సీఎం కావాలి. ఆ హోదాలో మా గ్రామంలో పర్యటించాలి’ అని మాట్లాడారు. దీనికి ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ నవ్వుతు చూద్దాం..చూద్దాం అన్నట్లు తలఊపారు.

ఇక ఈ సభలో పవన్ మాట్లాడుతూ..తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని పవన్ స్పష్టం చేసారు. ‘సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. నాకు సినిమాల కంటే సమాజం ముఖ్యం. గ్రామాలు, రైతులు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. అందరి దగ్గర డబ్బులుంటేనే సినిమాలు కూడా ఆడతాయి’ అని సభలో వ్యాఖ్యానించారు.

Read Also : Ukraine Missile : భారత యుద్ధ విమానాలను మరింత శక్తివంతం చేసిన ఉక్రెయిన్ క్షిపణి ఎంత శక్తివంతమైనదో తెలుసా..!

  Last Updated: 23 Aug 2024, 12:37 PM IST