Site icon HashtagU Telugu

Pawan Russia File:ర‌ష్యా ఫైల్`బ్రో`!ఢిల్లీలో అంబ‌`ఢీ`!!

Pawan Russia File

Pawan

జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద ర‌ష్యా ప్ర‌భుత్వం సీరియ‌స్ (Pawan Russia File) గా ఉందా? ఆయ‌న‌పై అక్క‌డ ఫైల్ ఓపెన్ అయిందా? దానికి బ‌లం చేకూరేలా ఢిల్లీలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేయ‌నున్నారా? అంటే ఔనంటున్నారు వైసీపీలోని కొంద‌రు కీల‌క లీడ‌ర్లు. వారాహి యాత్ర‌కు కాకినాడ వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మీద ప‌వ‌న్ విరుచుకుప‌డిన‌ప్పుడు మంత్రి అంబ‌టి ఏదో ర‌ష్యా క‌బుర్లు చెప్పార‌నుకుంటున్నాం. ఆ సంద‌ర్భంగా `నీ మీద రష్యాలో ఫైల్ ఓపెన్ అయింది. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఒకసారి యాక్షన్ మొదలుపెడితే మోదీ చెప్పినా వినదు` అంటూ అంబ‌టి హెచ్చ‌రించారు. కానీ, ప‌వ‌న్ విన‌కుండా వైసీపీ మీద విమ‌ర్శ‌లు జోరుపెంచారు. దీంతో ఆయ‌న ఆర్థిక మూలాల‌ను త‌వ్వుతున్నారు వైసీపీ కింగ్ పిన్స్.

 ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద ర‌ష్యా ప్ర‌భుత్వం సీరియ‌స్ (Pawan Russia File)

టాలీవుడ్ సినిమా నిర్మాణంకు, విదేశీ పెట్టుబ‌డుల‌కు(Pawan Russia File) ద‌గ్గ‌ర సంబంధం ఉంది. విదేశాల నుంచి డ‌బ్బు రావ‌డం సినిమా నిర్మాణాల్లో స‌హ‌జంగా జ‌రుగుతుంటుంద‌ట‌. ప్ర‌త్యేకించి పాన్ ఇండియా, పాన్ వ‌ర‌ల్డ్ సినిమాల‌కు విదేశీ పెట్టుబ‌డులు స‌ర్వ‌సాధార‌మ‌ని సినిమా పెద్ద‌లు చెప్పుకుంటారు. అగ్ర‌హీరోల‌తో సినిమా అంటే మ‌నీ లాండ‌రింగ్ త‌ప్ప‌ద‌నే భావ‌న టాలీవుడ్ లో బ‌లంగా ఉంది. ఆ కోవ‌లోకి `లైగ‌ర్‌` సినిమా వెళ్లింది. అంతే, మ‌నీలాండ‌రింగ్ జ‌రిగింద‌ని అనుమానిస్తూ ఈడీ దాడులు చేసింది. సీన్ క‌ట్ చేస్తే, ఆ దాడుల ఎపిసోడ్ ఎమ్మెల్సీ క‌విత లిక్క‌ర్ స్కామ్ వ‌ర‌కు వెళ్లింది. సినిమా డైరెక్ట‌ర్ పూరి, నిర్మాత చార్మిల‌తో పాటు పెట్టుబ‌డులు పెట్టిన వాళ్ల‌ను ఈడీ విచార‌ణ చేసింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి కూడా కొన్ని సినిమాల‌కు పెట్టుబడులు పెట్టార‌ని ఆ మ‌ధ్య జ‌న‌సేన విశాఖ‌కు చెందిన కార్పొరేట‌ర్ బ‌య‌ట‌పెట్టారు. ఆ నిధులు కూడా మ‌నీలాండ‌రింగ్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది.

`బ్రో` సినిమా నిర్మాణంకు వాడిని నిధుల గురించి తెర‌మీదకు

తాజాగా `బ్రో` సినిమా నిర్మాణంకు వాడిని నిధుల గురించి తెర‌మీదకు వ‌చ్చింది. ఆ సినిమాకు విదేశాల నుంచి డ‌బ్బు వ‌చ్చింద‌ని వైసీపీ చెబుతోంది. అంతేకాదు, చంద్ర‌బాబు ద్వారా ఆ డ‌బ్బు విదేశీ అకౌంట్ల నుంచి జ‌మ అయింద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు అంటున్నారు. ఆధారాల‌తో స‌హా గురువారం ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డి వైసీపీ ఎంపీల‌తో క‌లిసి కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు ఆధారాల‌ను అంద‌చేయ‌నున్నారు. విదేశీ ఖాతాలు ఎవ‌రివి? ఆ డ‌బ్బును ఎందుకు పంపించారు? ఎవ‌రు వినియోగించారు? బ్రో సినిమాకు వాడారా? లేదా? అనే ప్ర‌శ్న‌ల‌తో ఫిర్యాదు చేయ‌డానికి సిద్ద‌మ‌య్యా. ఆ సినిమాకు పెట్టుబడులు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయి? ప‌వ‌న్ ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారు? ఆయ‌న మేన‌ల్లుడు సాయిథ‌రమ్ తేజ్ కు ఎంత ఇప్పించాడు? సినిమా నిర్మాణంకు ఎంత ఖ‌ర్చు అయింది? త‌దిత‌ర వివ‌రాల‌ను రైట్ టూ ఇన్ఫ‌ర్మేష‌న్ యాక్ట్ కింద తీసుకున్నార‌ని తెలుస్తోంది. వాటిని జ‌త‌చేయ‌డం ద్వారా ఫిర్యాదు చేయ‌డానికి ఢిల్లీ కేంద్రంగా (Pawan Russia File) వైసీపీ పావులు క‌దుపుతోంది.

Also Read : Pawan Politics: మంగళగిరి కేంద్రంగా ‘పవన్’ రాజకీయం, ఎన్నికలే లక్ష్యంగా దూకుడు

సాధార‌ణంగా సినిమా నిర్మాణం బ్లాక్ లో జ‌రుగుతుంద‌ని టాలీవుడ్ గురించి తెలిసిన వాళ్ల‌కు బాగా తెలుసు. బ్లాక్ మ‌నీ వైట్ గా మార్చుకోవ‌డానికి సినిమా ఇండ‌స్ట్రీని ఎక్కువ‌గా వాడుతుంటార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌. అందుకే, సినిమా పెద్ద‌లు ఎప్పుడూ అధికార‌పార్టీకి అడుగుల‌కు మ‌డుగులొత్తుతుంటారు. ఇటీవ‌ల టాలీవుడ్ టాప్ హీరోలంద‌రూ తాడేప‌ల్లి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం వ‌ద్ద క్యూ క‌ట్టిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే, తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత పెట్టిన తెలుగు మ‌హాస‌భ‌లకు టాలీవుడ్ క్యూ క‌ట్టింది. సినిమా ప‌రిశ్ర‌మ ప్ర‌స్తుతం క‌ల్వ‌కుంట్ల కుటుంబం ద‌యాదాక్షిణ్యాల మీద బ‌తుకుతుంద‌ని టాక్‌. అందుకే, లైగ‌ర్ పాన్ ఇండియా సినిమాగా నిర్మాణం జ‌రిగింద‌ని అప్ప‌ట్లో వినిపించిన మాట‌. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ , హ‌రీశ్ , క‌విత‌ల‌కు అణిగిమ‌ణిగి ఉండే ప‌వ‌న్ ఏపీలో మాత్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేకంగా ఉన్నారు. ఆ కార‌ణంగా ఆయ‌న‌తో సినిమాలు తీసిన నిర్మాత‌లు  (Pawan Russia File) ఆరిపోతున్నారు.

Also Read : Janasena Strategy : BJP గేమ్ లో ఆట‌గాడు

ఇటీవ‌ల ప‌వ‌న్ హీరోగా వ‌చ్చిన వ‌కీల్ సాబ్, భీమ్లా నాయ‌క్ సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. తాజాగా విడుద‌లైన బ్రో సినిమా బాక్స్ ఆఫీస్ ల వ‌ద్ద బోల్తా ప‌డింది. అయితే, ఈ సినిమాల క‌లెక్ష‌న్లు త‌గ్గిపోవ‌డానికి కార‌ణం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటూ ప‌వ‌న్ చెబుతున్నారు. క‌నీసం రూ. 30కోట్లు బీమ్లా నాయ‌క్ సినిమాకు న‌ష్టం వాటిల్లింద‌ని ఆరోపిస్తున్నారు. ప్ర‌స్తుతం బ్రో సినిమా ప్లాప్ కావ‌డంతో నిర్మాత ఆరిపోయారు. కానీ, అదంతా చంద్ర‌బాబు ఇచ్చిన బ్లాక్ మ‌నీ అంటూ వైసీపీ రాజ‌కీయ గేమ్ మొద‌లు పెట్టింది. ఢిల్లీ వ‌ర‌కు  (Pawan Russia File) ప‌వ‌న్ సినిమాల మనీ లాండ‌రింగ్ వెళ్లింది. అంతేకాదు, ర‌ష్యాకు సంబంధించిన ఫైల్ ఏదో ఉంద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు చెబుతున్నారు. ఆ ఫైల్ ఏమిటి? అనేది వివ‌రించి చెప్ప‌డానికి ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డంలేదు. మొత్తం మీద ప‌వ‌న్ ప్ర‌స్తుతం స‌తీమ‌ణి ర‌ష్యా కావ‌డంతో ఏదో ఫైల్ ఉంద‌ని అనుమానం క‌లిగేలా అంబ‌టి `లీక్` ఇచ్చారు. ర‌ష్యా చ‌ట్టాల ప్ర‌కారం త్వ‌ర‌లోనే ప‌వ‌న్ కు ఏదో జ‌ర‌గ‌బోతుంద‌ని టాలీవుడ్ లోనూ టాక్ ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ ఢిల్లీ వెళ్లి అంబ‌టి రాంబాబు కేవ‌లం బ్రో వ‌ర‌కు ఫిర్యాదు చేస్తారా? ర‌ష్యా ఫైల్ ను క‌దిలిస్తారా? అనేది పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లోని చ‌ర్చ‌.