Site icon HashtagU Telugu

Pawan Kalyan : పిఠాపురంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్

Pawan Tollywood

Pawan Tollywood

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి పిఠాపురం (Pithapuram)లో భూములు కొనుగోలు (Pawan Purchase of Lands) చేశారు. గతంలో భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన ఆయన..తాజాగా పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తోట సుధీర్‌ మంగళవారం పూర్తి చేశారు. త్వరలోనే ఈ స్థలంలో ఇల్లు, క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తారని సమాచారం.

ఇలా వరుస పెట్టి భములు కొనుగోలు చేస్తుండడం తో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ పూర్తిగా పిఠాపురంలోనే ఉండబోతారని..ఆయన సినీ , రాజకీయ వ్యవహారాలన్నీ కూడా ఇక్కడి నుండే చూసుకుంటారని తెలుస్తుంది. పవన్ ఇలా వరుసగా భూములు కొనుగోలు చేస్తుండడం తో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.5 లక్షల వరకు పలికే ధర..పవన్ కొనడం మొదలుపెట్టిన దగ్గరి నుండి చాలామంది భూములు కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో భూముల ధరలు రోజు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్‌ విలువ రూ.15-16 లక్షల మేర ఉంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురాన్ని దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై ఆరా తీస్తూ..అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ..నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.

Read Also : YS Sharmila Protest : కరెంటు బిల్లు-జేబుకి చిల్లు..5 నెలలకే బాబు చుక్కలు – షర్మిల