Site icon HashtagU Telugu

Davos : టీడీపీ దావోస్ టూర్ పై పవన్ పంచ్ లు.. ఛీ ఎంతకు దిగజారారు రా.. !

Pawan Cbn Davos Tour

Pawan Cbn Davos Tour

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు & లోకేష్ బృందం (Chandrababu & Lokesh) దావోస్ పర్యటన(Davos Tour)కు వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు , లోకేష్ (Chandrababu & Lokesh)ఇద్దరు అగ్ర సంస్థలతో సమావేశాలు , ఏపీ వాతావరణం, అభివృద్ధి ఇలా అన్ని తెలిపారు. చాల సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపించాయి. ఈ సారి చంద్రబాబు దావోస్ పర్యటనలో ఎలాంటి ముందస్తు ఒప్పందాలు చేసుకోలేదు. పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేస్ అనుకూలతల గురించి ప్రజెంటేషన్ ఇవ్వడం. తమ రాష్ట్రానికి వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఓ రకంగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ మీదనే దృష్టిపెట్టారు. ఇది అర్ధం చేసుకోలేని వైసీపీ నేతలు బాబు టూర్ పై విమర్శలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇది చాలదన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడిన గత వీడియోలను లింక్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.

Hathya Movie : ‘హత్య’ మూవీ రివ్యూ.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మరో సినిమా..

‘పెట్టుబడుల తీస్కుని రాలేదని టీడీపీ దావోస్ టూర్ పై పంచ్ లు వేసిన డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్’ అనే క్యాప్షన్‌తో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడిన వీడియోను గ్రాడ్యుయేట్ అడ్డా (X/GraduateAdda) అనే ఎక్స్ యూజర్ పోస్టు చేశారు. ఈ వీడియో థంబ్ మీద.. టీడీపీ దావోస్ టూర్‌పై పవన్ పంచ్‌లు అని రాసి ఉంది. చంద్రబాబు అండ్ కో దావస్ పర్యటనలో ఉన్న వీడియోను, పవన్ మాట్లాడిన వీడియోను మిక్స్ చేసి ఈ వీడియో వదిలారు. ‘దావోస్‌కెళ్లిపోయి కోట్లు వేసుకొని.. బ్లూ కోట్లు గావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు.. ఏవైనా నాకు ఇబ్బంది లేదు కానీ.. నిజంగా ఆంధ్రప్రదేశ్‌ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కుంటూ వస్తారు విదేశాల నుంచి..’ అని పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

‘పెట్టుబడుల కోసం దావోస్ దాకా వెళ్ళవలసిన అవసరం లేదు… డబ్బులు దండగ. – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్💥💥💥’ అనే క్యాప్షన్‌తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతోన్న 17 సెకన్ల నిడివి ఉన్న వీడియో క్లిప్‌ను భాస్కర్ రెడ్డి (X/chicagobachi) అనే యూజర్ సైతం జనవరి 24న ఎక్స్‌లో పోస్టు చేశారు. కాకపోతే పవన్ కళ్యాణ్ అన్నంది..అప్పటి వైసీపీ దావోస్ టూర్ పై. కాకపోతే దానిని ఇప్పటి చంద్రబాబు దావోస్ టూర్ తో లింక్ చేసి పోస్ట్ చేసారు. ఈ వీడియోలు చూసి అంత చంద్రబాబు , లోకేష్ లపై విమర్శలు చేస్తారని వారు భావించారు. కానీ నెటిజన్లు , ప్రజలు అంత పిచ్చివారు కాదు. పవన్ ఎప్పుడో మాట్లాడిన మాటలను ఇప్పుడు జత చేస్తే అంత అర్ధం చేసుకొని వారు ఎవ్వరు ఉండరని రివర్స్ కామెంట్స్ చేస్తున్నారు.