Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఆశించేది కేవలం సినిమా డైలాగులు, జగన్ ని తిట్టడం. తన ప్రసంగంలో జగన్ ని తిడుతున్నంతసేపు అరుపులు, కేకలతో మోత మోగిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో పని చేస్తున్న జనసైనికులు మాత్రం పవన్ ప్రసంగంలో అభివృద్ధి, తానేం చేస్తాడో చెబితే వినాలనుకుంటారు. ఇన్నాళ్లు సీఎం జగన్ ని ఓ రేంజ్ లో విమర్శించిన పవన్ తొలిసారి ఒక నియోజకవర్గానికి తానేం చేయదలుచుకున్నాడో వివరించాడు. ఒక నియోజకవర్గంపై పూర్తి అవగాహనతో మాట్లాడారు. ఇది పవన్ లో మార్పు కావొచ్చు, ఓట్లు వేయాల్సిన నియోజకవర్గం అని కావొచ్చు. ఏదైతేనేం పవన్ మాటల్లో అభివృద్ధి అన్న పదం పదే పదే వినిపించడం సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు. తాజాగా ఆయన పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించి ప్రసంగించారు. దత్త పీఠం, పాద గయ, శక్తి పీఠం, ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, బంగారు పాపా దర్గా వంటి ఆధ్యాత్మిక సంస్థలన్నీ పిఠాపురంలోనే ఉన్నాయని పవన్ చెప్పారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గాన్ని దేశంలోనే నెం.1 మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పిఠాపురంను కలుపుతూ టెంపుల్ సర్క్యూట్‌ను అభివృద్ధి చేస్తానని పవన్ చెప్పారు. టూరిజం అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు నాకు స్థానిక నియోజకవర్గం లేదు. పిఠాపురం ఇప్పుడు నా సొంత నియోజకవర్గం అని పవన్ అన్నారు. మత్స్యకారుల కోసం జెట్టీలు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని, సముద్ర కోతకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిఠాపురం సీడ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పిఠాపురంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తనకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు లేవని, అయితే సమస్యలపై పోరాడాలని జేఎస్పీ చీఫ్ అన్నారు. దశాబ్ద కాలంగా తాను ఒంటరి పోరు చేస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో తనను నమ్మి మద్దతు ఇవ్వాలని పవన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని 54 గ్రామాల సమస్యలు తనకు తెలుసునన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో డీజిల్, బియ్యం, డ్రగ్ మాఫియాలకు కాకినాడ పోర్టు కేంద్రంగా మారిందని ఆరోపించారు.
Also Read: Telangana: తెలంగాణలో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్, కామారెడ్డి దెబ్బకు డీలా పడిన గులాబీ బాస్