Pawan : జ‌న‌సేన‌కు కులం,మ‌తం బుర‌ద‌! కాపు,బ‌లిజ వాదం!!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan) పార్టీ మూల సిద్ధాంతం కులాల‌ను క‌లిపే,

  • Written By:
  • Updated On - March 13, 2023 / 04:19 PM IST

`చెప్పేది  శ్రీరంగ నీతులు దూరితే..అదేదో`అన్న‌ట్టు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan) వాల‌కం ఉంది. ఆ పార్టీ (Janasena) మూల సిద్ధాంతం కులాల‌ను క‌లిపే, మ‌తాల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయం` అనే విష‌యాన్ని మ‌రిచిపోయారు. ఆవిర్భావం దినోత్స‌వానికి సిద్ధ‌మ‌వుతోన్న జ‌న‌సేన‌కు కులాల దిశానిర్దేశం చేయ‌డం విచిత్రంగా ఉంది. కాపు, బీసీ కులాలు క‌లిసి జ‌న‌సేన పార్టీని గెలిపించాల‌ని ఆయ‌న పిలుపు ఇస్తున్నారు. అంతేకాదు, కాపులు ఐక్యంగా లేర‌ని చెబుతున్నారు. జ‌న‌సేన కులానికి చెందిన పార్టీ కాద‌ని చెబుతూనే తాను కాపు కులానికి చెందిన వ్య‌క్తిని కాదంటూ మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించారు. తండ్రి కాపు త‌ల్లి సూర్య బ‌లిజ అంటూ ఆ రెండు కులాలు ఒక‌టే అనే సంకేతం పంపారు. కాపు స‌మ్మేళ‌నం, బీసీ మీటింగ్ ల్లో ప‌వ‌న్ మాట్లాడిన మాట‌ల‌న్నీ కులాల చుట్టూనే తిరిగాయి. అందుకే, పూట‌కో కులమంటూ ప‌వ‌న్ చెబుతార‌ని మంత్రి బొత్సా సెటైర్ వేస్తూ వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు.

మూల సిద్ధాంతం కులాల‌ను క‌లిపే, మ‌తాల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయం(Pawan) 

రెల్లి కులం నాది అంటూ ఒక‌సారి ప‌వ‌న్ (Pawan)అంటారు. ఇంకోసారి తెలంగాణ‌లో పుట్టలేద‌ని బాధ‌ప‌డుతున్నా అంటూ హైద‌రాబాద్ లో చెబుతారు. ఏపీ కులాల‌ కుంప‌ట్లో ఉంద‌ని ఏహ్య‌భావం ప్ర‌ద‌ర్శిస్తారు. కాపు ఓట‌ర్ల‌ను న‌మ్మ‌డానికి లేదంటారు. వాళ్లంద‌రూ ఓటేస్తే గ‌త ఎన్నిక‌ల్లో గెలిచే వాడిన‌ని చెబుతున్నారు. ఇలా ప‌లు ర‌కాలుగా కులాల‌ను రెచ్చ‌గొట్టేలా ఆయ‌న ప్ర‌సంగం ఉంది. తోడుగా హ‌రిరామ జోగ‌య్య కాపు కార్డ్ ను బ‌లంగా వినిపిస్తున్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అదే స‌మ‌యంలో బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాలు క‌లిసి ఉండాల‌ని పిలుపునిస్తున్నారు. అంటే, కాపుల‌కు రాజ్యాధికారం కావాలంటే మిగిలిన కులాలు అన్నీ ఆ కులానికి మ‌ద్ధ‌తు ప‌లకాల‌ని రెండు మీటింగ్ ల ద్వారా ప‌వ‌న్ చెబుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాలు క‌లిసి ఉండాల‌ని

సైద్ధాంతిక బ‌లం లేకుండా పార్టీని  న‌డ‌ప‌లేమ‌ని ప‌వ‌న్ (Pawan) చెబుతున్నారు. ఇప్పుడు జ‌న‌సేన‌కు (Janasena)ఉన్న సిద్ధాంత ఏమిటో ఎవ‌రికీ అర్థం కావ‌డంలేద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు చేస్తోన్న విమ‌ర్శ‌లు. తొమ్మిదేళ్ల క్రితం పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా చాక‌లి ఐల‌మ్మ‌, కాన్షీరాం, చేగువీరా ఇలా ప‌లువురి పేర్లు చెబుతూ వాళ్ల భావ‌జాలం వినిపించారు. పార్టీ నిర్మాణం ఏ మాత్రం లేకుండా 2014 ఎన్నిక‌ల్లో మోడీ, చంద్ర‌బాబు స‌భ‌ల్లో క‌నిపించారు. ఆ రోజు నుంచి మోడీ, చంద్ర‌బాబు భావ‌జాలాన్ని 2018 వ‌ర‌కు వినిపించారు. ఆ త‌రువాత చేగువీరా, కాన్షీరాం భావ‌జాలం అంటూ బీఎస్పీ, క‌మ్యూనిస్ట్ ల‌తో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నిక‌ల‌కు వెళ్లారు. సీన్ క‌ట్ చేస్తే ఆయ‌న ఓట‌మితో పాటు డిపాజిట్లు గ‌ల్లంతు అయిన నియోజ‌క‌వ‌ర్గాలు అనేకం. ఆ పార్టీకి వ‌చ్చిన ఓటు బ్యాంకు 4 శాత‌మా? 5శాత‌మా? అనేది కూడా చెప్ప‌లేం. ఒక్క ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలిచారు. ఆయ‌న కూడా ప‌వ‌న్ వాల‌కం న‌చ్చ‌క వైసీపీ పంచ‌న చేరారు.

Also Read : Janasena : జ‌న‌సేన‌లో చేరిన ఇద్ద‌రు మాజీ ఎమ్మెల్యేలు

2019 ఎన్నిక‌లు ముగిసిన కొద్ది రోజుల‌కు హిందూవాదం వైపు ఉంటాన‌ని చెప్పారు. ఢిల్లీ బీజేపీతో పొత్తు అంటూ వినిపించారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన(Janasena) విలీనం కోసం ఒక జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంద‌ని సంకేతం క్యాడ‌ర్ కు ఇచ్చారు. ఇలా రాజ‌కీయ పొర్లుదండాలు పెడుతూ బీజేపీ పొత్తు అంటూనే విడిగా అప్పుడ‌ప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతూ ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని లాక్కొచ్చారు. తాజాగా రామ్ మ‌నోహ‌ర్ లోహియా భావ‌జాలం అంటూ కొత్త‌గా అందుకున్నారు. ఆ భావ‌జాల‌న్ని ఈనెల 13న జ‌రిగే మ‌చిలీప‌ట్నం స‌భ‌లో వినిపించ‌బోతున్నారు. ఆ మేర‌కు రెండు రోజులుగా విజ‌య‌వాడ కేంద్రంగా జ‌రుగుతోన్న స‌న్నాహాక స‌మావేశాల్లో ఆయ‌న సంకేతాలు ఇచ్చారు. సైద్ధాంతిక బ‌లం లేకుండా పార్టీని న‌డ‌ప‌లేమ‌ని చెబుతూనే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన(Pawan) సిద్ధాంతం ఏమిటో ఇత‌మిద్ధంగా చెప్ప‌లేక‌పోతున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపించే మాట‌.

త్రిశంకు స్వ‌ర్గంలో   మ‌చిలీప‌ట్నం స‌భ‌ (Janasena)

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌న‌సేన(Janasena) పార్టీ ఒంట‌రిగా వెళితే, ఏమ‌వుతుంది? అనేది ప‌వ‌న్ (Pawan)కు బాగా క్లారిటీ ఉంది. అందుకే, ఒంట‌రిగా వెళ్లి రాజ‌కీయ వీర‌మ‌ర‌ణం పొంద‌డం కంటే పొత్తుల దిశ‌గా ఆలోచిస్తున్నాన‌ని ఇటీవ‌ల ఆయ‌న వెల్ల‌డించారు. ఆ సంగ‌తి త‌న‌కు వ‌దిలేయాల‌ని క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నాన‌ని గ‌త ఏడాది కాలంగా చెబుతున్నారు. ఆ మ‌ధ్య ఏపీకి వ‌చ్చిన మోడీ కొన్ని చుర‌కలు వేసి వెళ్లారు. దీంతో రోడ్ మ్యాప్ ను మ‌రిచిపోయారు. ఇప్పుడు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా ఎలా చేయాలి? అనే అంశంపై గుప్పిగంత‌లు వేస్తున్నారు. బీజేపీని కాద‌ని టీడీపీ పంచ‌న చేర‌లేని ప‌రిస్థితి ఒక వైపు. ఒంటరిగా పోటీ చేయ‌లేని నిస్స‌హాయ‌త ఇంకో వైపు. అలాగ‌ని, బీజేపీ, టీడీపీని క‌లిపే సాహ‌సం మోడీ వ‌ద్ద చేయ‌లేక‌పోతున్నార‌ని రాజ‌కీయ ఒన‌మాలు తెలిసిన ఎవ‌రైనా చెబుతారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌న‌సేన పార్టీ భ‌విష్య‌త్ ఏమిటి? అనేది అగ‌మ్య‌గోచ‌రం. త్రిశంకు స్వ‌ర్గంలోని ఆ పార్టీకి ఒక‌ సిద్ధాంతం అంటూ లేద‌ని వైసీపీ చెబుతోంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ కూడా అదే చెప్పింది. ఇప్పుడు బీజేపీకి కూడా అర్థ‌మ‌యింది. ఇలాంటి పరిస్థితుల్లో మ‌చిలీప‌ట్నం స‌భ‌లో ఏదో చెబుతార‌ని ఆశించ‌డం అభిమానుల‌కు అత్యాశే అవుతుంది.

మెగా కుటుంబం కులం మీద పెద్ద చ‌ర్చ

క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న త‌రువాత కాపు, బ‌లిజ‌, శెట్టి బ‌లిజ‌, తెల‌గ‌, ఒంట‌రి కులాల మ‌ధ్య అంత‌రం ఉంద‌ని ప‌వ‌న్ (Pawan)ఆల‌స్యంగా గ్ర‌హించారు. ఇటీవ‌ల చేసిన స‌ర్వేల ద్వారా ఆ విష‌యం అర్థం చేసుకున్న‌ట్టు ఉన్నారు. అందుకే, ఇప్పుడు తాను కాపు కులం మాత్ర‌మేకాద‌ని, బ‌లిజ కూడా అనే సంకేతం ఇస్తున్నారు. ఇక శెట్టి బ‌లిజ‌,  తెల‌గ‌ , ఒంట‌రి కులాల‌న్నీ ఐక్యంగా ఉండాల‌ని ఒక‌ప్పుడు వంగ‌వీటి రంగా ఇచ్చిన పిలుపు దిశ‌గా ప‌వ‌న్ వెళుతున్నారు. బ‌హుశా ఇదే విష‌యాన్ని మ‌చిలీప‌ట్నం వేదిక‌గా ప‌వ‌న్ వినిపించ‌డానికి సిద్ద‌మ‌యిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ లోనూ మెగా ఫ్యామిలీ కాపు కులం కాద‌ని దాస‌రి నారాయ‌ణ రావు వాయిస్ వినిపించారు. నిజ‌మైన కాపు కులం త‌మ‌దంటూ ఆయ‌న ముందుకొచ్చారు. ఆ రోజుల్లో మెగా కుటుంబం కులం మీద పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ఇప్పుడు మ‌ళ్లీ కాపు, బ‌లిజ ఒక‌టే అనే సంకేతం ఇవ్వ‌డానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారు. అందుకే, తండ్రి కాపు, త‌ల్లి సూర్య బ‌లిజ అంటూ కులాల ప్ర‌స్తావ‌న ప్ర‌ముఖంగా జ‌నసేనాని తీసుకొచ్చారు. మొత్తానికి కులాల చుట్టూ రాజ‌కీయాన్ని ప‌వ‌న్ అల్లుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇలా జ‌న‌సేన(Janasena) పార్టీని ఎలా కాపాడుతారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

Also Read : Janasena : `వారాహి` క‌దిలేది అప్పుడే.! ఆర్భావ స‌భ‌లో జై చంద్ర‌న్న‌ రోడ్ మ్యాప్ ?