Illegal Transport : రేషన్ అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ.. పవన్, నాదెండ్ల రాజీనామా చేయాలి: అంబటి

ఎనభై శాతం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. బియ్యం అక్రమ రవాణా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ పోర్టు నుండి పేదల బియ్యం(పీడీఎస్‌) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యలో నిన్న తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ..కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల పాత్ర ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘రేషన్ అక్రమ రవాణాను పవన్ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? ఆయన ప్రభుత్వంలో ఉన్నారో లేదో అర్థం కావడం లేదు. పవన్ ఇంకా ప్రశ్నించే ధోరణిలోనే ఉన్నారా? ఆయన అసమర్థుడనే విషయం అర్థమవుతోంది. రేషన్ అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ పవన్, నాదెండ్ల రాజీనామా చేయాలి’ అని అంబటి డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం లో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అసమర్ధుడు. బియ్యం అక్రమ రవాణా అడ్డుకునే చిత్తశుద్ధి లేదన్నారు. ఎమ్మెల్యే కొండ బాబుకు మామూళ్ళు లేకుండానే ఇదంతా జరుగుతుందా. పవన్ కల్యాణ్ పెద్ద అసమర్థుడు అని అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ కు లెక్కలేనంత తిక్క ఉంది. దోపిడి తప్ప ఇంకేం పనిలేవంటూ సెటైర్లు వేశారు. రెండు నెలల నుంచి అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారని.. వారు సహకరించడం లేదని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారని గుర్తుచేశారు. అధికారులు తనను అడ్డుకున్నారని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారని.. బహుశా చంద్రబాబు, నారా లోకేశ్‌ చెప్పడంతోనే అధికారులు అడ్డుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఉప ముఖ్యమంత్రికి అంతలా ప్రాధాన్యం ఇవ్వద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమోనని అన్నారు.

పవన్ కళ్యాణ్, మరొక సిద్దాంత కర్త నాదెండ్ల మనోహర్ తో కలిసి వెళ్ళారు. కలెక్టర్ పట్టుకున్న బియ్యాన్ని మేము పట్టుకున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఎనభై శాతం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. బియ్యం అక్రమ రవాణా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో లేదో అర్థం కావటం లేదు. బియ్యం అక్రమ రవాణాలో ఎమ్మెల్యేల పాత్ర ఉంది అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read Also: Champions Trophy 2025: ఐసీసీ, బీసీసీఐ ముందు తలవంచిన పాకిస్థాన్!

  Last Updated: 30 Nov 2024, 07:28 PM IST