Site icon HashtagU Telugu

Pawan Kalyan : పవన్ పర్యటన తో మన్యం లో డోలిమోతలు తగ్గుతాయా..?

Pawan Alluri Tour

Pawan Alluri Tour

దేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్న..చంద్రుడి ఫై కాలు మోపి చరిత్రలో నిలిచిన ఏపీ లో మాత్రం డోలిమోతలు తప్పడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న, మీము ఇది చేసాం అది చేసాం అని గొప్పగా చెప్పుకొచ్చిన, ఏజెన్సీ లో మాత్రం గిరిజనుల (Tribal People problems) తిప్పలు తప్పడం లేదు. పాల‌కులు ఎంద‌రూ మారిన గిరిజ‌నుల బ‌తుకులు మాత్రం మార‌డం లేదు. మాట‌లు చెప్పే నాయ‌కులు మాత్ర‌మే ఉన్నారు కాని గిరిజ‌నులు జీవితాల‌పై ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌త్యేక దృష్టి సారించింది ఎవరు లేరు. స‌రియైన వైద్యం అంద‌క‌, ర‌హ‌దారులు లేక ఇప్ప‌టికి గిరిజ‌న‌లు ప‌డుతున్న బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ప్రాణం మీదకు వస్తే చాలు..డోలి కట్టి మోత మోస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇలా ఇప్పుడు కాదు ఎప్పటి నుండే ఇదే నడుస్తుంది. అర్ధరాత్రైనా..అపరాత్రైనా సరే నలుగురు తోడు తీసుకొని అరణ్యాలు దాటాల్సిందే. ఆ అరణ్యాలు దాటేసారి డోలి లో ఉన్న ప్రాణం ఉంటె దేవుడి దయ..లేదంటే కాటికే. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా..ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకతో మా డోలిమోతలు తప్పుతాయని మన్యం ప్రజలు అంటున్నారు.

విశాఖ ఏజెన్సీలో ఏటా అనేకమంది గర్భిణులు, బాలింతలు, వివిధ రోగాల బారిన పడిన వారు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అడవి బిడ్డల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్న వాటిని సరి అయిన రీతిలో ఖర్చు చేయకపోవడం వలన అర్ధాయేషుతోనే చాలామంది మరణిస్తున్నారు. నవ మాసాలు నిండిన శిశువు కళ్ళు తెరవకుండానే కడుపులోని ప్రాణాలు కోల్పోతుంది. ఏజెన్సీలోని అనేక మారుమూల ప్రాంతాల నుంచి వైద్య సహాయం కోసం నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రావలసి వస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ సరైన రోడ్ల సౌకర్యం లేకపోవడంతో డోలీలలో వారిని మైదాన ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అనేక సందర్భాలలో గర్భిణులు, రోగులు మార్గమధ్యంలోనే ప్రాణాలు విడుస్తున్నారు. గర్భిణుల కోసం ప్రభుత్వం పోషకాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో వీరికి ప్రభుత్వం ప్రత్యేక వసతి గృహ సౌకర్యం కూడా కల్పించింది. గర్భిణీలకు కాన్పు ఎప్పుడు వచ్చేది అన్న విషయాన్ని వైద్యులు ముందుగానే నిర్ధారించగలరు. కానీ కొంతమంది డాక్టర్లు ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం లేదు. మరి కొంతమంది డాక్టర్లు రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడక, ఆఖరి నిమిషంలో గర్భిణులను విశాఖలోని కేజీహెచ్ కు రిఫర్ చేస్తున్నారు. ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాల్లోని ఆసుపత్రులకు రావాలంటే 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కొండ మీద నుంచి కిందకు దిగటానికి చాలా రోడ్లు గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ కనీసం ఆటోలు, అంబులెన్సులు కానీ ప్రయాణించే పరిస్థితి లేదు. జీకే వీధి మండలంలోని ముంచింగి పుట్టు, చింతపల్లి, కొండ వంచల, పెద్దూరు, శరభన్నపాలెం, డొంకరాయి, సీలేరు, డుంబ్రిగూడ, ములగపాడు తదితర ప్రాంతాల నుంచి డోలీలలో రోగులను తరలించాల్సి వస్తోంది.

ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు రోడ్లు నిర్మిస్తున్నామని అధికారులు చెప్తున్నారు కానీ, కార్యరూపం దాల్చడం లేదు. ఏజెన్సీలలో ఉన్నతాధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి ఎందుకు సారించడం లేదు? డోలి ప్రయాణాలను నివారిస్తామని ప్రజా ప్రతినిధులు చెబుతున్న, అది వాస్తవ రూపం దాల్చడం లేదు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అందులోని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో మన్యం ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా శనివారం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించారు. పాలనలో తనదైన ముద్ర ఉండాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. అనేక అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఏజెన్సీలో డోలీల మోత అంశం ఆయన దృష్టికి వచ్చింది. ఈ విషయంలో ఆయన చొరవ తీసుకొని మారుమూల ప్రాంతాలలోని యుద్ధ ప్రాతిపదికన నిర్మించగలిగితే అడవి బిడ్డలకు ఊపిరి పోసినవారవుతారని ఆదివాసులు ఆశతో ఉన్నారు. ఇప్పటికే తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మన్యం ప్రాంతాల్లో రోడ్ల కు శంఖుస్థాపన చేసారు. ఇక ఇప్పుడు డోలిమోతలు కూడా లేకుండా చేస్తానని మాట ఇవ్వడం తో మన్యం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also :Star Health : “స్టార్ ఆరోగ్య డిజి సేవ”ను ఆవిష్కరించిన స్టార్ హెల్త్