Pawan Kalyan : ఆ ఇద్దర్ని ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని బాబుకు పవన్ వినతి

నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను విప్‌లుగా నియమించాలని కోరినట్లు పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 09:37 PM IST

తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను విప్‌లుగా నియమించాలని కోరినట్లు పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక ఈరోజు పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో పర్యటించారు. గొల్లప్రోలులో జనసేన వీరమహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటే ఏదైనా జరుగుతుందన్నారు. ప్రపంచం గుర్తించేలా పిఠాపురం నుంచి మార్పు ప్రారంభించాలని సంకల్పిస్తున్నామని చెప్పారు. మీ గొంతే నా గొంతు మీ కలే నా కల అన్నారు. గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టి ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని గుర్తుచేశారు. పదవులు వచ్చినంత మాత్రనా తల ఎగుర వేయకూడదని పేర్కొన్నారు. వ్యక్తిగత ద్యేషాలకు విధ్వాంశాలకు పాల్పడవద్దని కార్యకర్తలకు నాయకులకు సూచించారు

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఇప్పుడు నేను కేవలం ఎమ్మెల్యేను మాత్రమే కాదు..ఎన్డీయేకు అండగా నిలబడ్డ వ్యక్తిని. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటాం. పొట్టి శ్రీరాములు బలిదానం వల్లే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. డొక్కా సీతమ్మ సేవల్ని మనమంతా నిత్యం స్మరించుకోవాలి. ఆమె పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయగలనా అని నిత్యం ఆలోచిస్తున్నా. పిఠాపురాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తా. పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే నన్ను ఊరేగించండి” అన్నారు.

ఇక మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా ఎన్నికల్లో పనిచేసిన నా కోసం పనిచేశారు. ఏమిచ్చి జనసైనికుల రుణం తీర్చుకోగలను. నేను అనుకున్న ఆశయం కోసం మీరంతా చేతులు కలిపినందుకు ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా ఆ కృతజ్ఞత సరిపోదు. అరాచక పాలన, దాష్టీకాలను ఎదురొడ్డి మరీ నిలబడ్డారు. మీరంతా జనసేనకు బలం ఇవ్వడం కాదు.. ఐదుకోట్ల మంది ప్రజలకు బలాన్నిచ్చారు. జనసేన నేతలు లేని ఊరుంటుందేమో నాకు తెలియదు గానీ.. జనసైనికులు, వీరమహిళలు లేని ఊరుండదు” అని పవన్‌ వ్యాఖ్యానించారు. అలాగే ప్రతిపక్షం లేదని అనుకోవద్దు సమస్య వచ్చినప్పుడు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఈ సందర్బంగా పవన్ అన్నారు.

Read Also : Parliament Session: పార్లమెంటులో రాహుల్ ప్రశ్నలపై రేపు ప్రధాని మోడీ సమాధానాలు