Site icon HashtagU Telugu

Pawan Kalyan : జగన్ ను గద్దె దించేవరకు మీరు ఎన్నిహారతులు తీసినా ప్రయోజనం లేదు

Pawan Kkd

Pawan Kkd

ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రోజు రోజుకు మరింత దూకుడు పెంచుతున్నారు. ఓ పక్క కూటమి అధికారంలోకి వస్తే జరిగే మంచి ని వివరిస్తూనే…జగన్ (Jagan) ను ఓడించకపోతే రాష్ట్రం ఇప్పటికే బాగు పడదని చెపుతూ వస్తున్నారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్నప్పటికీ దానిని ఏమాత్రం లెక్కచేయకుండా పవన్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈరోజు కాకినాడలో భారీ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా యువతకు చెప్తున్నాను. రౌడీయిజానికి, దాష్టికానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు. నేను మీకు దైర్యం ఇవ్వడానికి వచ్చాను. మీరు ఎన్ని హారతులు తీసినా.. మీ గుండెల్లో దైర్యం అనే జ్యోతిని వెలింగించకపోతే అదంతా వ్యర్థం అవుతుంది. మార్పు తీసుకురావడానికి వచ్చాను నేను.. వైఎస్ జగన్ ను గద్దె దించేవరకు మీరు ఎన్నిహారతులు తీసినా ప్రయోజనం లేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు తీరు సరికాదు. తన సోదరుడు చిరంజీవి పెట్టిన బిక్షతో కన్నబాబు ఎదిగారు. జగన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఈబీసీ రిజర్వేషన్లను తీసేశాడు. మిగిలిన కులాలకు కూడా జగన్ అన్యాయం చేశాడు. వైసీపీ నేతలు ప్రమాదకర పాలసీలు తీసుకొస్తున్నారు, అసలు జగన్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు పవన్. రాష్ట్రంలో అన్ని వర్గాలను జగన్ మోసం చేశారు. మద్య పాన నిషేధం అని చెప్పి ఛీట్ చేశారు. చివరికి జగన్ సారా వ్యాపారిలా మారారు. జే బ్రాండ్ మద్యంతో రూ.41వేలు కోట్లు అక్రమంగా సంపాదించారన్నారు.

Read Also : 30 Years Prudhvi : వైసీపీ కాదు.. ఉగ్రవాదుల ఫ్యాక్టరీ