Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 10 గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయా శాఖల పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌తో సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ భేటీ అయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.53 నిమిషాలకు ఆయన విజయవాడలోని జలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, శాస్త్ర, సాంతిక, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా బాధ్య తలు చేపట్టారు. అయితే.. ఈ సందర్భంగా రెండు ఫైళ్లపై పవన్ కల్యాణ్ సంతకాలు చేశారు. తొలి సంత కం మాత్రం తన వద్ద ఉన్న పెన్నుతోనే చేశారు. అనంతరం.. వదినమ్మ సురేఖ ఇటీవల ప్రజెంట్ చేసిన పెన్నుతో సంతకం చేశారు. ఈ రెండు సంతకాలు చేయడానికి ముందు.. కార్యాలయంలో ప్రత్యేక పూజల్లోపాల్గొన్నారు. అనంతరం వేడ పండితుల.. ఆశీర్వ చనం అందుకున్నారు.