Site icon HashtagU Telugu

Janasena: జనసేనకు ఇరకాటం, బీజేపీ కి చెలగాటం

Janasena For AP

Pawan Kalyan's Janasena Problem, Bjp's Problem

Pawan Kalyan’s Janasena : రాజకీయ వీరమరణం అంచుకు జనసేన (Janasena) చేరింది. ఢిల్లీ బీజేపీ పెద్దలు కన్ను తెరిస్తే గ్లాస్ గల్లంతు కానుంది. ఇటీవల పవన్ వేస్తున్న అడుగులు బీజేపీ పెద్దలకు ఏమాత్రం నచ్చటం లేదని తెలుస్తోంది. సీఎం పదవి రేస్ నుంచి తప్పుకొని చంద్రబాబుకు ఓపెన్ ఆఫర్ ఇవ్వటం ఏమిటి? అంటూ బీజేపీ ఏపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. ఆ విషయాన్ని కొన్ని రోజుకు క్రితం సోము వీర్రాజు ప్రకటించారు. ఆ తరువాత బీసీ లు సీఎం అభ్యర్థిగా ఉంటారని ఆయన వెల్లడించారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నుంచి బీజేపీ, జనసేన (Janasena) కలిసి కనిపించలేదు. పై గా టీడీపీకి పవన్ దగ్గర అయ్యారు. ఇలాంటి పరిణామం బీజేపీ ముందుగానే ఊహించింది. అందుకే జనసేన సింబల్ గ్లాస్ గల్లంతు అయినా ఢిల్లీ బీజేపీ పెద్దగా పట్టించుకోదు. ఒక వేళ పవన్ కామన్ గుర్తు కోసం లేఖ రాసినా ఎన్నికల కమిషన్ పెద్దగా పరిగణనలోకి తీసుకోదు. కారణం పవన్ టీడీపీ తో వెళ్తున్నారు. బీజేపీ ని కూడా కూటమిలో కి తీసుకు వస్తానని ప్రకటించటం బీజేపీ సీనియర్లకు మండుతుందట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తో కలిసి వెళ్తే మునుగుతామని టీడీపీ భావిస్తుంది. అందుకే , బీజేపీని వదిలించుకుని జనసేన , కమ్మునిస్టులు, టీడీపీ కూటమిగా వెళ్తే బాగా ఫలితాలు ఉంటాయని సర్వేల సారాంశం. ఈ కూటమిలో కాంగ్రెస్ ను కూడా కలుపుకొని వెళ్తే ఎలా ఉంటుంది? అని కోణం నుంచి కూడా సర్వేలు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలను బీజేపీ తెలుసుకొని జనసేనకు వీలున్నంత వరకు కట్టడి చేయాలని చూస్తుంది. ఆ క్రమంలో గ్లాస్ గుర్తుకు ప్రమాదం ఏర్పడింది.

ఇప్పటి వరకు పదేళ్ల లో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జనసేన ఓట్లను సంపాదించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఈసీ నిబంధనల మేరకు ఓట్లు రాకపోతే పార్టీ వీరమరణం పొందినట్టే. అందుకే , బతుకించుకోవడానికి టీడీపీ పల్లకి ని పవన్ ఎత్తుకున్నారు. ఒక వేళ బీజేపీ తో వెళ్లినా ఫలితం ఉండదు. అందుకే సర్వేలను బేస్ చేసుకొని చంద్రబాబు కు జై కొట్టారు పవన్.

ప్రస్తుతం జనసేన పార్టీకి గుర్తింపు లేదు. కేవలం రిజిస్ట్రేషన్ పార్టీగా మాత్రమే ఉంది. గత ఎన్నికల్లో కామన్ గుర్తు ఇచ్చిన ఈ సీ ఈసారి ఇవ్వాలంటే బీజేపీ మద్దతు ఉండాలి. ఓటు బాంక్ ఎంత ఉంది అనేది జనసేన తెలియదు. నాలుగు పార్టీలతో కలసి గత ఎన్నికల్లో పోటీ చేసింది. బీ ఎస్ పీ , ఉభయ కమ్మునిస్టులు, జనసేన కలిస్తే వచ్చిన ఓటు 5 శాతం, అంటే దానిలో జనసేన వాటా ఎంతో తెలియదు. 2019 నుంచి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. గ్లాస్ గుర్తు తో స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో నాన్ సీరియస్ పార్టీ గా జనసేన పార్టీని ఈ సీ గుర్తించింది. ఫలితంగా ఉప ఎన్నికల ఫ్రీ సింబల్ గా గ్లాస్ ను గుర్తించింది. తాజా గా వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్దతి కొనసాగేలా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పవన్ లేఖ రాసిన గ్లాస్ దక్కే పరిస్థితి లేదు. చంద్రబాబును కాదంటే పార్టీ వీరమరణం, బీజేపీని దూరం చేసుకుంటే గ్లాస్ గోవిందా అంటుంది. ఇలాంటి పరిస్తుతుల్లో పవన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Also Read:  KCR: కాంగ్రెస్ పై కేసీఆర్ స్వారీ, ఎన్డీయే ముద్రలో వైసీపీ, టీడీపీ