Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ఉద్య‌మంలోకి ప‌వ‌న్‌..ఆందోళ‌న‌లో వైసీపీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఉద్య‌మానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో అధికార వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది.

  • Written By:
  • Updated On - November 2, 2021 / 11:55 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఉద్య‌మానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో అధికార వైసీపీకి ఇబ్బందిక‌రంగా మారింది. బీజేపీతో మిత్ర‌ప‌క్షంగానే ఉంటూ స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ‌ను ప‌వ‌న్ వ్య‌తిరేకిస్తుండ‌టంతో వైసీపీ అధిష్టానం త‌ల‌లుప‌ట్టుకుంటుంది. ప‌వ‌న్‌కు అన్ని వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌టంతో స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ వ్య‌తిరేక ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

260 రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు,నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేస్తున్నారు.అయితే వీరికి సంఘీభావం తెలిపేందుకు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదివారం వైజాగ్‌లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు.ప‌వ‌న్ విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వ‌ర‌కు దారి పోడువునా ప్ర‌జ‌లు ప‌వ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.ర్యాలీ సంద‌ర్భంగా జంక్ష‌న్‌లో భారీ క్రేన్ స‌హాయంతో గ‌జ‌మాల‌తో అభిమానులు ప‌వ‌న్‌ని స‌త్క‌రించారు.

గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించిన గాజువాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును పోందేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరాట‌ప‌డుతున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు.అయితే దీనిని జ‌న‌సేన నేత‌లు కొట్టిపారేశారు. బాధితుల‌కు అండ‌గా ఉండాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసిన‌ట్లు జ‌న‌సేన నాయ‌కులు తెలిపారు.

గాజువాక ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తే ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చేశారు.త‌న‌ను ఎన్నుకుని ఉంటే లేదా కనీసం త‌న పార్టీకి పార్లమెంటులో కొన్ని సీట్లు ఇచ్చి ఉంటే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ వ్య‌తిరేకంగా చ‌ట్ట‌స‌భల్లో మాట్లాడేవాడిన‌ని అన్నారు. అయితే ఇప్ప‌టికైనా స‌మ‌స్య నుంచి పారిపోవ‌డానికి ఇక్క‌డికి రాలేద‌ని..ప్ర‌జ‌లంద‌రు కావాల్సిన శ‌క్తి త‌న‌కు ఇస్తే అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

అప్పట్లో పరిశ్రమల శాఖ మంత్రి ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పుడు దేశంలోనే అత్యుత్తమ ప్రాంతంగా వైజాగ్‌ గుర్తింపు పొందిందని గుర్తు చేశారు.అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను మార్చి మరో రాష్ట్రంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కేంద్రంపై తిరుగుబాటుకు దిగారని.. ఇట్ ప్పుడు స్టీల్ ప్లాంప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ తరహాలో వైసీపీపై మరో తిరుగుబాటు చేయాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ డైలామాలో ప‌డింది.స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ వ్య‌తిరేక ఉద్య‌మం ఇప్ప‌టివ‌ర‌కు నిదానంగా సాగినా ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఉద్య‌మం మ‌రింత ఉదృత‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే రాజ‌ధాని రైతులు మహా పాద‌యాత్ర నిర్వ‌హిస్తుండ‌గా..స్టీల్ ప్లాంట్ ఉద్య‌మం కూడా ఉవ్వెత్తున ఎగిసిప‌డితే వైసీపీ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశం ఉంది.