Pawan Kalyan : ఈ నెల 20వ తేదీన కడప జిల్లాలో జనసేనాని పర్యటన..!!

ఆంధ్రప్రదేశ్ లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే పవన్ ఈనెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి సూసైడ్ చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజంపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు. సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలోపవన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పవన్ తోపాటు జనసేన రాజకీయ వ్యవహార కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొనున్నారు.

  Last Updated: 16 Aug 2022, 09:48 PM IST