Site icon HashtagU Telugu

Pawan Kalyan : త్వరలో ప్రజాకోర్టు కార్యక్రమం.. వీరమహిళల సమావేశంలో పవన్ కళ్యాణ్..

Pawan Kalyan

Pawan Kalyan will start a new Program Praja Court from Janasena

నేడు స్వాతంత్ర దినోత్సవం(Independence Day) నాడు మంగళగిరి(Mangalagiri) జనసేన(Janasena) పార్టీ ఆఫీసులో జెండా ఎగురవేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). అనంతరం పార్టీ మహిళా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చించారు. త్వరలోనే ప్రజా కోర్టు అనే కార్యక్రమాన్ని చేపడతానని తెలిపారు.

జనసేన మహిళా కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. త్వరలోనే ప్రజాకోర్టు పేరుతో కార్యక్రమం చేపడతాను. సోషల్ మీడియాలో, కొన్నిసార్లు బయట కూడా ఈ కార్యక్రమం చేపడతాం. ఎవరైతే తప్పులు చేస్తారో, ఎలాంటి తప్పులకు, ఎలాంటి శిక్షలు పడాలి, తప్పు ని ఎలా కంప్లైంట్ చేయాలి, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన.. ఇలాంటి అన్ని విషయాల గురించి ప్రజలకు తెలియాలి. అలా తెలియచేసే కార్యక్రమమే ప్రజాకోర్టు. తప్పు జరిగినప్పుడు ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పాలి. తప్పుని ఎవరూ సమర్దించకూడదు. రాజ్యాంగంలోని చట్టాలను తెలుసుకోవాలి అందుకే ఈ ప్రజా కోర్టు అని తెలిపారు.

మరోసారి ఏపీలో మహిళపై జరుగుతున్న దాడులు, మిస్సింగ్ కేసుల గురించి స్పందించారు పవన్. దీని గురించి మాట్లాడుతూ.. మేము అధికారంలోకి రాగానే మహిళలు, పిల్లలకు మరింత భద్రత కల్పిస్తాము. అక్కను ఏడిపించొద్దు అని అడిగిన 14 ఏళ్ల బాలుడిని తగులబెట్టారు. ఆయేషా, శ్రీలక్ష్మి, సుగాలి ప్రీతి ఇలా మహిళలపైనే దాడులు జరుగుతున్నాయి. ఇవి ఆపేందుకు ప్రభుత్వాలు ఎందుకు బలంగా పనిచేయడం లేదు? 30 వేల మంది మహిళలు అదృశ్యమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆరోపించారు.

 

Also Read : Pawan Kalyan : వైసీపీ ప్రచారం నమ్మకండి అంటూ ప్రజలకు క్లారిటీ ఇచ్చిన పవన్