Site icon HashtagU Telugu

Pawan Kalyan : భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలకు పవన్ కళ్యాణ్.. ఏపీ తరపున ముత్యాల తలంబ్రాలు..

Pawan Kalyan will Participating in Bhadrachalam Srirama Navami Celebrations

Pawan Kalyan

Pawan Kalyan : రేపు శ్రీరామ నవమి ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే దేశంలోని ఆలయాలు అన్ని ముస్తాబయ్యాయి. తెలంగాణలోని భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయని తెలిసిందే. రేపు భద్రాచలం రామయ్య కళ్యాణం కూడా జరగనుంది. అయితే ఈసారి భద్రాచలం శ్రీరామ నవమి వేడుకలు మరింత స్పెషల్ కానున్నాయి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఒక్కరోజు ముందుగానే ఖమ్మం జిల్లాకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని మాదాపూర్ లో తన ఇంటి వద్ద నుంచి రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ భద్రాచలం వెళ్లనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం చేరుకుంటారు. నేడు రాత్రి అక్కడే బస చేస్తారు.

రేపు ఉదయం ఆదివారం నాడు భద్రాచల రాముడ్ని దర్శనం చేసుకొని అనంతరం భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు ఇవ్వనున్నారు. అలాగే కళ్యాణం కార్యక్రమంలో పాల్గొంటారు పవన్. అనంతరం రేపు సాయంత్రం ఐదు గంటకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి పది గంటలకు తిరిగి మాదాపూర్ నివాసానికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ భద్రాచలం వస్తున్నాడు అని తెలియడంతో అక్కడి ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Also Read : Minister Uttam Kumar: మంత్రి ఉత్త‌మ్ కుమార్ మంచి మ‌న‌సు.. మెడికల్ కళాశాలపై వ‌రాల జ‌ల్లు!