Site icon HashtagU Telugu

Pawan Kalyan : మరోసారి అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్.. పర్యటన రద్దు

Pawan Kalyan, who fell ill again, cancelled the tour

Pawan Kalyan, who fell ill again, cancelled the tour

Pawan Kalyan: మరోసారి జనసేనా(Janasena)ని పవన్ కల్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(varahi yantra) రద్దయింది. నిన్న అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభ అనంతరం జ్వరం రావడంతో ఈరోజు యలమంచిలి పర్యటనను పవన్ రద్దుచేసుకున్నారు. ఎండల వేడిమి కారణంగా పవన్ తరచూ జ్వరం బారినపడుతుండడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల ఆయన జ్వరం బారినపడడంతో రెండు రోజులపాటు పర్యటనను రద్దుచేసుకుని నిన్నటి నుంచి వారాహి యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో అనకాపల్లిలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన అనంతరం పవన్ మళ్లీ జ్వరం బారినపడ్డారు. దీంతో నేటి పర్యటనను రద్దుచేసుకున్నారు. కాగా, ఈ నెల తొలివారంలో పవన్ తెనాలి పర్యటన కూడా రద్దయింది.

Read Also: Delhi Liquor Policy Case : ఎమ్మెల్సీ కవిత కు నో బెయిల్..

మరోవైపు ఏపీలో మే 13న ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీలన్నీ ప్రచార జోరు కొనసాగిస్తున్నాయి. ఓవైపు సీఎం జగన్, మరోవైపు చంద్రబాబు ప్రచారంలో ముందుకెళుతున్నారు. ఏపీలో పొత్తు నేపథ్యంలో, మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. వీరిద్దరూ ఉభయ గోదావరి జిల్లాల్లో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారు.

Read Also: CM Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవి ఊడినట్టేనా? ఈ రోజు విచారణపై ఉత్కంఠ

ప్రజాగళం మూడో విడతలో భాగంగా… చంద్రబాబు, పవన్ ఏప్రిల్ 10, 11 తేదీల్లో కలిసి ప్రచారం చేయనున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలులో జరిగే సభల్లో పాల్గొంటారు. ఈ నెల 11న పి.గన్నవరం, అమలాపురంలో ఉమ్మడిగా ప్రచారం చేస్తారు.