Chandrababu Arrest:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు అరెస్ట్ పెను సంచలనంగా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో తన పేరును చేర్చి చంద్రబాబును సీఐడీ అదుపులోకి తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అధికార పార్టీపై టీడీపీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నారు. కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. చంద్రబాబును సిట్ కార్యాలయానికి తరలించగా ఆయనను చూసేందుకు పవన్ కళ్యాణ్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయానికి వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో వాహనం దిగి నడిచి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అయితే పవన్ ను పోలీసులు ముందుకు వెళ్లనీయకపోవడంతో పోలీసుల తీరుకు నిరసనగా జాతీయ రహదారికి అడ్డంగా పవన్ కళ్యాణ్ పడుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పవన్ కళ్యాణ్ ని అక్కడినుంచి హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక పోలీసు బలగాలని రప్పించేందుకు స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై నారాలోకేష్ మండిపడ్డారు. ఏ కారణం లేకుండా పోలీసులే అల్లరి మూకల మాదిరిగా రోడ్డుకి అడ్డంపడి పవన్ కళ్యాణ్‌ను కదలనివ్వకుండా చేయడం దారుణమన్నారు.
అనుమంచిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించిన జనసేనాని, మంగళగిరి కార్యాలయం వెళ్లి తీరుతానని @PawanKalyan గారి నిర్ణయం#HelloAP_ByeByeYCP pic.twitter.com/QU0V6iGYDj
— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023
Also Read: Chandrababu Naidu : 2 గంటలు వెయిట్ చేయించి.. చంద్రబాబుతో కుటుంబ సభ్యులని కల్పించిన సీఐడీ..